logo

అరకు ఘాట్‌రోడ్డులో రాకపోకలు బంద్‌

అనంతగిరి ఘాట్‌రోడ్డులో బుధవారం వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మిగ్‌జాం తుపాను కారణంగా మంగళవారం రహదారిపై పడిన కొండచరియలను తొలగిస్తుండగా బుధవారం అనంతగిరి- బొర్రా జంక్షన్‌ మధ్య బొడగుడ సమీపంలో మరో కొండచరియ జారి రహదారిపై పడింది.

Published : 07 Dec 2023 02:26 IST

అనంతగిరి/గ్రామీణం, న్యూస్‌టుడే: అనంతగిరి ఘాట్‌రోడ్డులో బుధవారం వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మిగ్‌జాం తుపాను కారణంగా మంగళవారం రహదారిపై పడిన కొండచరియలను తొలగిస్తుండగా బుధవారం అనంతగిరి- బొర్రా జంక్షన్‌ మధ్య బొడగుడ సమీపంలో మరో కొండచరియ జారి రహదారిపై పడింది. దీంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. పోలీసు సిబ్బంది అక్కడకు చేరుకుని స్థానికుల సహయంతో వాటిని తొలగించేందుకు చర్యలు చేపట్టారు. కొండల పైనుంచి వర్షపు నీరు రహదారిపైకి ప్రవహిస్తుండటంతో మళ్లీ కొండచరియలు జారిపడేందుకు అవకాశం ఉన్న నేపథ్యంలో బొడ్డవర చెక్‌పోస్టు వద్ద పోలీసులు వాహనాలు నిలిపివేశారు. కొండచరియలు పడిన ప్రాంతాలను జడ్పీటీసీ సభ్యుడు గంగరాజు, నాయకులు పరిశీలించారు.

పెదకోట, జీనబాడు, మేడపర్తి తదితర ప్రాంతాల్లో పంట పొలాలు తడిచిముద్దయ్యాయి. జీనబాడు ప్రాంతంలో పంట పొలాలను ఎంపీపీ నీలవేణి, కో ఆప్షన్‌ సభ్యుడు మదీనా పరిశీలించారు. అనంతగిరి వైయస్‌ఆర్‌ కాలనీకి చెందిన ధనలక్ష్మి ఇంటి పైకప్పు కూలిపోయి వర్షపు నీరు ఇంట్లోకి చేరింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని