logo

నష్టాలపై నివేదికలు రూపొందించండి

మిగ్‌జాం తుపాను ప్రభావంతో జిల్లాలో దెబ్బతిన్న ఇళ్లు, వ్యవసాయ, ఉద్యాన పంటలు, పశువులు, నీటి పారుదల వ్యవస్థలపై నివేదికలు రూపొందించాలని కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ ఆదేశించారు.

Published : 07 Dec 2023 02:27 IST

పాడేరు, న్యూస్‌టుడే: మిగ్‌జాం తుపాను ప్రభావంతో జిల్లాలో దెబ్బతిన్న ఇళ్లు, వ్యవసాయ, ఉద్యాన పంటలు, పశువులు, నీటి పారుదల వ్యవస్థలపై నివేదికలు రూపొందించాలని కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ ఆదేశించారు. తుపాను సహాయక చర్యలపై బుధవారం సీఎం జగన్‌ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ పాల్గొన్నారు. అనంతరం వివిధ విభాగాల అధికారులతో సమావేశమయ్యారు.

ఈనెల 9వ తేదీ నుంచి తుపాను నష్టాలపై సర్వే చేపట్టాలన్నారు. రవాణాకు ఎటువంటి అంతరాయం ఏర్పడకుండా చూడాలన్నారు. జిల్లా వ్యవసాయాధికారి నంద్‌ మాట్లాడుతూ.. సుమారు 600 హెక్టార్లలో వరి పంట నష్టపోయినట్లు అంచనా వేశామన్నారు. పత్తి 250 హెక్టార్లలో నష్టపోయినట్లు చెప్పారు. జిల్లా ఉద్యానాధికారి రమేష్‌కుమార్‌రావు మాట్లాడుతూ.. చింతూరు డివిజన్‌లో 50 ఎకరాల వరకు మిర్చి పంట దెబ్బతినే అవకాశం ఉందన్నారు. సంయుక్త కలెక్టర్‌ శివ శ్రీనివాసు, జిల్లా అదనపు ఎస్పీ అనిల్‌కుమార్‌, ఈఈలు బాలసుందరబాబు, బి.బాబు, కొండయ్యపడాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు