logo

రౌడీషీటర్ల బైండోవర్‌: డీఎస్పీ

పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసేవరకు అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని డీఎస్పీ బి.వెంకటరామయ్య సూచించారు.

Published : 23 Feb 2024 01:25 IST

సూచనలు ఇస్తున్న డీఎస్పీ వెంకటరామయ్య

నర్సీపట్నం అర్బన్‌, న్యూస్‌టుడే: పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసేవరకు అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని డీఎస్పీ బి.వెంకటరామయ్య సూచించారు. పాయకరావుపేట, నర్సీపట్నం నియోజకవర్గాల పోలీసు సిబ్బందికి గురువారం నర్సీపట్నంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఓటర్లంతా స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగించుకునేలా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోందన్నారు. అందరి కర్తవ్యం పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసేలా చూడటమే అన్నారు. ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కాకపోయినా ఎన్నికల సంఘం సూచన మేరకు లైసెన్స్‌డ్‌ తుపాకులు స్వాధీనం చేసుకుంటున్నాం, రౌడీషీటర్లు, గొడవలు సృష్టిస్తారన్న అనుమానం ఉన్నవారిని బైండోవర్‌ చేస్తున్నాం, చెక్‌పోస్టుల్లో తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. లెక్కలు చూపకుండా డబ్బు తరలింపుపైనా దృష్టి సారించామని వివరించారు. నక్కపల్లి సీఐ అప్పన్న మాట్లాడుతూ ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో సెల్‌ఫోన్లు ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని విధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. మాట జారినా ప్రమాదమేనని గుర్తుంచుకోవాలన్నారు. అనుకోకుండా ఏదైనా జరిగితే పై అధికారికి సమాచారం ఇవ్వాలన్నారు. గ్రామాల్లో పరిస్థితులు గమనించాలని సూచించారు. వాటర్‌బాటిల్‌ సైతం పోలింగ్‌ కేంద్రంలోకి అనుమతించకూడదన్నారు. పోలింగ్‌ విధులకు వెళ్లినవారు ఎవరి ఆతిథ్యమూ స్వీకరించకూడదన్నారు. నర్సీపట్నం టౌన్‌ సీఐ కాంతికుమార్‌, గ్రామీణ సీఐ హరి, పలువురు ఎస్సైలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని