logo

వైకాపా నేతలను అడ్డుకుంటాం

ప్రభుత్వం ఆదివాసీ ప్రత్యేక డీఎస్సీ ప్రకటించాలని గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు పి.అప్పలనర్సయ్య డిమాండ్‌ చేశారు.

Published : 23 Feb 2024 01:25 IST

ఐటీడీఏ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న నిరుద్యోగులతో గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు పి.అప్పలనర్సయ్య తదితరులు

పాడేరు, న్యూస్‌టుడే: ప్రభుత్వం ఆదివాసీ ప్రత్యేక డీఎస్సీ ప్రకటించాలని గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు పి.అప్పలనర్సయ్య డిమాండ్‌ చేశారు. గురువారం గిరిజన సంఘం ఆధ్వర్యంలో గిరిజన నిరుద్యోగులు ఐటీడీఏ కార్యాలయం ఎదుట  ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా అప్పలనర్సయ్యతోపాటు పలువురు వక్తలు మాట్లాడుతూ.. జీవో నంబర్‌ 3ను కారణంగా చూపి ఆదివాసీ నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన డీఎస్సీ నోటిఫికేషన్‌లో ఆదివాసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని చెప్పారు. పాడేరు ఐటీడీఏ పరిధిలో 99 శాతం ఆదివాసీలు ఉంటే కేవలం 7 పోస్టులే కేటాయించడం దుర్మార్గమన్నారు. గిరిజన ప్రత్యేక డీఎస్సీ ప్రకటించని పక్షంలో వైకాపా నేతలను ఎక్కడికక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం, గిరిజన ఎమ్మెల్యేలు, ఎంపీ.. ఆదివాసీ హక్కులు, చట్టాలను తుంగలో తొక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆదివాసీ నిరుద్యోగుల పోరాటానికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని అప్పలనర్సయ్య పేర్కొన్నారు. గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి కిల్లో సుందరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి బాల్‌దేవ్‌, అధ్యక్షులు ధర్మన్నపడాల్‌, సహాయ కార్యదర్శి కృష్ణారావు, ఏజెన్సీ డీఎస్సీ సాధన సమితి కన్వీనర్‌ నరేష్‌, సమన్వయకర్తలు చంటి, మత్స్యరాజు, కృష్ణ, నూకరాజు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని