logo

వేలాడుతూ ప్రయాణాలు...

ప్రమాదాలు జరుగుతాయని తెలిసినా ఆర్టీసీ బస్సులు పూర్తిస్థాయిలో లేకపోవడంతో ప్రయాణికులు ఆటోల్లో ప్రయాణించక తప్పటం లేదు.

Published : 23 Feb 2024 01:29 IST

ప్రమాదాలు జరుగుతాయని తెలిసినా ఆర్టీసీ బస్సులు పూర్తిస్థాయిలో లేకపోవడంతో ప్రయాణికులు ఆటోల్లో ప్రయాణించక తప్పటం లేదు. నర్సీపట్నం- అడ్డురోడ్డు మార్గంలో ఉన్న జల్లూరు వరహానదిపై ఉన్న వంతెన శిథిలావస్థలో ఉండటంతో ఆర్టీసీ బస్సులు రెండే నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు, విద్యార్థులకు రాకపోకలు సాగించడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సకాలంలో ప్రయాణం సాగాలనే ఆలోచనతో ఆటోలు కిక్కిరిసినా వేలాడుతూ ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని ప్రయాణికులు చెబుతున్నారు. ఆటోల్లో నిబంధనల ప్రకారం    ప్రయాణికులను ఎక్కించుకునేలా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నారు.

కోటవురట్ల, న్యూస్‌టుడే

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని