logo

సీలేరు కాంప్లెక్స్‌లో విద్యుదుత్పత్తి నిలిపివేత

సీలేరు కాంప్లెక్స్‌లో మాచ్‌ఖండ్‌ జలవిద్యుత్కేంద్రంలో మినహా మిగిలిన అన్ని జలవిద్యుత్కేంద్రాల్లో విద్యుదుత్పత్తి జరగడం లేదు.

Published : 23 Feb 2024 01:29 IST

మాచ్‌ఖండ్‌లో అంతంతమాత్రం

డొంకరాయి జలాశయం

సీలేరు, న్యూస్‌టుడే: సీలేరు కాంప్లెక్స్‌లో మాచ్‌ఖండ్‌ జలవిద్యుత్కేంద్రంలో మినహా మిగిలిన అన్ని జలవిద్యుత్కేంద్రాల్లో విద్యుదుత్పత్తి జరగడం లేదు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న నీటిని సీలేరు, డొంకరాయి జలాశయాల్లో నిల్వ చేస్తున్నారు. పక్షం రోజులుగా సీలేరు కాంప్లెక్స్‌లోని జలవిద్యుత్కేంద్రాల్లో ఉత్పత్తి నిలిపివేసి వేసవిలో ఉత్పత్తికి అంతరాయం తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. బలిమెల జలాశయం నుంచి నీటి వాడకం ఆపేశారు. ఈ జలాశయంలో ఏపీ వాటా, డొంకరాయిలో ఉన్న నీటి నిల్వలు కలిపి ప్రస్తుతం 32.52 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయి. మార్చి వరకు వీటిని నిల్వ చేసేలా జెన్‌కో అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. మాచ్‌ఖండ్‌లో అంతంతమాత్రంగా ఉత్పత్తి జరుగుతోంది. 120 మెగావాట్ల సామర్థ్యం గల ఈ జలవిద్యుత్కేంద్రంలో రోజుకు ఒక మిలియన్‌ యూనిట్‌ పైచిలుకు ఉత్పత్తి చేస్తున్నారు. జలవిద్యుత్కేంద్రంలో రెండు, అయిదు, నాలుగు యూనిట్ల నుంచి ఉత్పత్తి నిలిపివేయగా.. గురువారం నుంచి ఆరో యూనిట్‌నూ సాంకేతిక మరమ్మతులతో ఆపేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని