logo

జాఫ్రా రైతులు మోసపోకుండా చర్యలు: పీవో గగోరే

మన్యంలో జాఫ్రా రైతులు దళారుల దగ్గర మోసపోకుండా చర్యలు చేపట్టామని, దీనిలో భాగంగానే ఎక్కడికక్కడ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్ట్‌ అధికారి సూరజ్‌ గనోరే పేర్కొన్నారు.

Published : 24 Feb 2024 01:24 IST

రంపచోడవరం, న్యూస్‌టుడే: మన్యంలో జాఫ్రా రైతులు దళారుల దగ్గర మోసపోకుండా చర్యలు చేపట్టామని, దీనిలో భాగంగానే ఎక్కడికక్కడ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్ట్‌ అధికారి సూరజ్‌ గనోరే పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో జాఫ్రా కొనుగోలుపై అధికారులతో సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జాఫ్రా కొనుగోలుపై గ్రామాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసేందుకు ఐదుగురు అధికారులతో బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ బృందంలో ప్రాజెక్టు వ్యవసాయ అధికారి రాంబాబు, ఉద్యాన అధికారి చిట్టిబాబు, ఉపాధిహామీ ఏపీడీ శ్రీనివాసరావు, వెలుగు డీపీఎం పరమేశ్వరరావు, హెచ్‌ఓ ముత్తయ్య ఉన్నారు. ఈ ఏడాది 100 మెట్రిక్‌ టన్నుల నుంచి 200 టన్నుల జాఫ్రా కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని