logo

అంగన్‌వాడీలకు ఇచ్చిన హామీల అమలు ఎప్పుడు?

ప్రభుత్వం ఇచ్చిన హామీలను  తక్షణమే అమలు చేయాలని అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మ డిమాండ్‌ చేశారు. 

Published : 24 Feb 2024 01:26 IST

రంపచోడవరం, న్యూస్‌టుడే: ప్రభుత్వం ఇచ్చిన హామీలను  తక్షణమే అమలు చేయాలని అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మ డిమాండ్‌ చేశారు.  సీఐటీయూ కార్యాలయంలో సంఘ జిల్లా అధ్యక్షురాలు రాజేశ్వరి అధ్యక్షతన శుక్రవారం సమావేశం నిర్వహించారు. సుబ్బరావమ్మ మాట్లాడుతూ సమ్మె కాలంలో ఇస్తామన్న వేతనాలను నేటికీ చెల్లించకపోవడం దారుణమన్నారు. కార్యకర్తలకు పదవీ విరమణ ప్రయోజనాలు రూ. 50 వేల నుంచి రూ. 1.5 లక్షలకు, సహాయకులకు రూ. 20 వేల నుంచి రూ. 60 వేలకు పెంచడానికి అంగీకరించారని, వీటిని వెంటనే అమలు చేయాలని కోరారు. సిబ్బంది మృతి చెందితే మట్టి ఖర్చు కింద రూ. 20 వేలతోపాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని, బీమా సౌకర్యం కల్పించాలని, వైఎస్‌ఆర్‌ పోషణ మెనూ ఛార్జీలను పెంచాలని కోరారు. సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి నిర్మల, సీఐటీయు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వాణిశ్రీ, వెంకట్‌, ఉపాధ్యక్షులు రామరాజు, నాయకులు  పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని