logo

యువత పాత్ర కీలకం

నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రావాలంటే చంద్రబాబును సీఎం చేయాలని మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పిలుపునిచ్చారు. శుక్రవారం తన నివాసంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మట్లాడారు.

Published : 24 Feb 2024 01:27 IST

పాడేరు, న్యూస్‌టుడే: నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రావాలంటే చంద్రబాబును సీఎం చేయాలని మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పిలుపునిచ్చారు. శుక్రవారం తన నివాసంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మట్లాడారు. రాష్ట్రానికి రాజధాని నిర్మాణం జరగాలంటే చంద్రబాబును గెలిపించాలన్నారు. యువత తెదేపాకు అండగా నిలవాలన్నారు. అవినీతిని అంతం చేయాలన్నా.. అభివృద్ధికి బాటలు వేయాలన్నా, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలన్నా యువత పాత్ర కీలకమని పేర్కొన్నారు. తెదేపా అధికారంలోకి వస్తే నిరుద్యోగ భృతి అందిస్తామని చెప్పారు. ఐదేళ్లలో వైకాపా అరాచక పాలన సాగించిందని విమర్శించారు. తెదేపీ ఎస్టీసెల్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు చిట్టిబాబు, లగిశపల్లి సర్పంచి లకే పార్వతమ్మ తదితరులు పాల్గొన్నారు.

ఐనాడ పంచాయతీ చీమలపల్లిలో ఈశ్వరి ఆధ్వర్యంలో బాబు స్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. వైకాపా అరాచక పాలనను అంతం చేద్దామని పిలుపునిచ్చారు. నాయకులు వెంకటరమణ, బుద్ద జ్యోతికిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు