logo

యూటీఎఫ్‌ నాయకులకు మళ్లీ నోటీసులు

సమస్యలు పరిష్కరించాలంటూ ఈ నెల 27న విజయవాడలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘం, ఏపీజేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించే ధర్నాలో పాల్గొనరాదంటూ రాజవొమ్మంగి మండలంలో పలువురు ఉద్యోగ, ఉపాధ్యాయులకు శుక్రవారం పోలీసులు నోటీసులు అందజేశారు.  

Published : 24 Feb 2024 01:29 IST

రాజవొమ్మంగి, కూనవరం, న్యూస్‌టుడే: సమస్యలు పరిష్కరించాలంటూ ఈ నెల 27న విజయవాడలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘం, ఏపీజేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించే ధర్నాలో పాల్గొనరాదంటూ రాజవొమ్మంగి మండలంలో పలువురు ఉద్యోగ, ఉపాధ్యాయులకు శుక్రవారం పోలీసులు నోటీసులు అందజేశారు.  కూనవరం పోలీసులు మళ్లీ నోటీసులు అందించారు.  సంఘం తరఫున ఏ కార్యక్రమం జరిగినా వెళ్లకూడదంటూ పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని మండల అధ్యక్ష, కార్యదర్శులు నాగేశ్వరరావు, కన్నారావు ఖండించారు.  రాజవొమ్మంగి మండలంలో దాదాపు 93 మందికి నోటీసులు అందజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని