logo

పల్స్‌ పోలియో విజయవంతం చేయండి

మార్చి మూడో తేదీన పల్స్‌ పోలియో చుక్కల కార్యక్రమం విజయవంతం చేయాలని కలెక్టర్‌ విజయసునీత పేర్కొన్నారు. జిల్లాలో ఐదేళ్లలోపు వయసున్న పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలని చెప్పారు.

Published : 24 Feb 2024 01:30 IST

పాడేరు, న్యూస్‌టుడే: మార్చి మూడో తేదీన పల్స్‌ పోలియో చుక్కల కార్యక్రమం విజయవంతం చేయాలని కలెక్టర్‌ విజయసునీత పేర్కొన్నారు. జిల్లాలో ఐదేళ్లలోపు వయసున్న పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలని చెప్పారు. శుక్రవారం ఐటీడీఏ సమావేశ మందిరంలో దీనికి సంబంధించిన గోడపత్రికలను ఐడీడీఏ పీవో అభిషేక్‌, జేసీ భావన, డీఎంహెచ్‌వో జమాల్‌బాషా తదితరులతో కలిసి ఆవిష్కరించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. జిల్లాలో 1,15,860 మంది ఐదు సంవత్సరాలలోపు వయసు గల పిల్లలు ఉన్నారని గుర్తించామన్నారు. వారందరికీ పోలియో చుక్కలు వేయాలని సూచించారు. జిల్లాలో 2,402 బూత్‌లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 77 సంచార వాహనాలు కేటాయించామని పేర్కొన్నారు. ఎస్డీసీ వీవీఎస్‌ శర్మ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు