logo

పోలింగ్‌ కేంద్రాల్లో పూర్తిస్థాయి వసతులు

పోలింగ్‌ కేంద్రాల్లో పూర్థిస్థాయి వసతులు ఉండేలా బూత్‌స్థాయి అధికారులు దృష్టి పెట్టాలని తహసీల్దార్‌ మౌలానా ఫాజిల్‌ సూచించారు.

Published : 24 Feb 2024 01:33 IST

వరరామచంద్రాపురం, న్యూస్‌టుడే: పోలింగ్‌ కేంద్రాల్లో పూర్థిస్థాయి వసతులు ఉండేలా బూత్‌స్థాయి అధికారులు దృష్టి పెట్టాలని తహసీల్దార్‌ మౌలానా ఫాజిల్‌ సూచించారు. మండలంలోని ఉమ్మడివరం, తమ్మయ్యపేట, రామవరం పోలింగ్‌ కేంద్రాలను శుక్రవారం ఆయన పరిశీలించారు. నిర్దేశించిన వసతులు పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోవడంపై అక్కడ సిబ్బందిని ప్రశ్నించారు. ఉపాధ్యాయులతో సమస్యలపై మాట్లాడారు. ఎన్నికల షెడ్యూల్‌ వచ్చేసరికి పోలింగ్‌ కేంద్రాల్లో వసతులు మొత్తం సమకూరాలన్నారు. ఆర్‌.ఐ. రామకృష్ణ, వీఆర్వోలు, వీఆర్‌ఏలు పాల్గొన్నారు.


ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి

కొయ్యూరు, న్యూస్‌టుడే: ప్రశాంత ఎన్నికలకు ప్రజలంతా సహకరించాలని కొయ్యూరు సీఐ వెంకటరమణ కోరారు. బూదరాళ్ల పంచాయతీలోని అన్నవరం, గొర్లెమెట్ట, కన్నవరం, గరిమండ, కునుకూరు గ్రామాలను శుక్రవారం ఆయన సందర్శించారు. అక్కడి గిరిజనుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామన్నారు. ఎన్నికల్లో అందరూ స్వేచ్ఛగా ఓటేయాలని పేర్కొన్నారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గరిమండ, కునుకూరు, కన్నవరం గ్రామాల్లోని పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించారు. మంప ఎస్సై లోకేష్‌కుమార్‌, పోలీసులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు