logo

150 టన్నుల కలప పట్టివేత

తట్టబందలోని కాటా నుంచి మూడు లారీల్లో తరలించేందుకు సిద్ధం చేసిన 150 టన్నుల అకేషియా కలపను విశాఖ సర్కిల్‌ అటవీ ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు శుక్రవారం పట్టుకుని సీజ్‌ చేశారు.

Published : 24 Feb 2024 01:34 IST

రావికమతం, న్యూస్‌టుడే: తట్టబందలోని కాటా నుంచి మూడు లారీల్లో తరలించేందుకు సిద్ధం చేసిన 150 టన్నుల అకేషియా కలపను విశాఖ సర్కిల్‌ అటవీ ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు శుక్రవారం పట్టుకుని సీజ్‌ చేశారు. అనంతరం వీటిని దొండపూడి సమీపంలోని అటవీ చెక్‌పోస్టు వద్దకు తరలించారు. తట్టబంద - ఎల్‌.ఎన్‌.పురానికి వెళ్లే మార్గంలోని వైకాపాకు చెందిన రాజాన నర్సింహులుకు కాటా ఉంది. ఈ కాటా నుంచి అకేషియా కలప రవాణా జరుగుతోందని స్థానికులు ఇచ్చిన సమాచారంతో డీఎఫ్‌ఓ సోమసుందరం ఆధ్వర్యంలో ఫ్లయింగ్‌ స్వ్కాడ్‌ అధికారి గంగరాజు, చోడవరం, అనకాపల్లి అటవీ రేంజ్‌ల సిబ్బందితో దాడులు చేశారు. మూడు లారీల్లో లోడు చేసిన కలపను సీజ్‌ చేసినట్లు గంగరాజు పేర్కొన్నారు. అకేషియా కలప రక్షిత అటవీ ప్రాంతంలోనిది కాదని, బయట నుంచి రాజాన చిన్నంనాయుడు అనే వ్యక్తి తరలిస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. ఒక్కో లారీకి రూ.లక్ష చొప్పున జరిమానా విధించినట్లు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని