logo

ఐటీడీఏ నిబంధనలకు ప్రభుత్వం తూట్లు

మన్యంలో గిరిజన సమస్యల పరిష్కార వేదికగా జరిగే ఐటీడీఏ పాలకవర్గ సమావేశాలను నిర్వహించకపోవడం దారుణమని మాజీ ఎమ్మెల్యే, తెదేపా సీనియర్‌ నాయకులు శీతంశెట్టి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు.

Published : 24 Feb 2024 01:45 IST

రంపచోడవరం, న్యూస్‌టుడే: మన్యంలో గిరిజన సమస్యల పరిష్కార వేదికగా జరిగే ఐటీడీఏ పాలకవర్గ సమావేశాలను నిర్వహించకపోవడం దారుణమని మాజీ ఎమ్మెల్యే, తెదేపా సీనియర్‌ నాయకులు శీతంశెట్టి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. శుక్రవారం రంపచోడవరంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. నియోజకవర్గంలో రెండు ఐటీడీఏలు ఉన్నాయని, ప్రతి మూడు నెలలకు ఒకసారి పాలకవర్గ సమావేశాలు నిర్వహించి అధికారులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో చర్చించాల్సి ఉందన్నారు. ఏడాదిలో కనీసం రెండు సమావేశాలైనా నిర్వహించాల్సి ఉందని తెలిపారు. జగన్‌ సీఎం అయ్యాక ఒక్కసారి కూడా పాలకవర్గ సమావేశం నిర్వహించకపోవడం దారుణమన్నారు. జగన్‌ ప్రభుత్వం ఐటీడీఏల నిర్వహణ నిబంధనలకు తూట్లు పొడిచిందని విమర్శించారు. ఉప ప్రణాళిక నిధులు కూడా ఈ ప్రాంతంలో ఖర్చు చేయకపోవడం దుర్మార్గమైన చర్య అన్నారు. వెంటనే పాలకవర్గ సమావేశాలను నిర్వహించి సమస్యలను పరిష్కరించాలని శీతంశెట్టి డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు