logo

ఏకలవ్యలో సమస్యల ఏకరవు

అరకులోయ, డుంబ్రిగుడ, అనంతగిరి మండలాల ఏకలవ్య పాఠశాలలకు ఈ ఏడాదైనా వసతి సమస్య తీరనుందా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి.

Published : 24 Feb 2024 01:47 IST

అరకులోయ, న్యూస్‌టుడే: అరకులోయ, డుంబ్రిగుడ, అనంతగిరి మండలాల ఏకలవ్య పాఠశాలలకు ఈ ఏడాదైనా వసతి సమస్య తీరనుందా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. మూడేళ్ల నుంచి ఈ మూడు మండలాలకు మంజూరైన ఏకలవ్య పాఠశాలలను అరకులోయ వైటీసీతోపాటు పాత టీటీసీ భవనంలోనే నిర్వహిస్తున్నారు. తాత్కాలిక భవనాల్లో తాగునీరు, వసతి సమస్యలు విద్యార్థులను వేధిస్తున్నాయి. ఏకలవ్య పాఠశాలలకు అరకులోయ మండలంలోని మజ్జివలస, డుంబ్రిగుడ మండల కేంద్రాల్లో భవన నిర్మాణాలు చేపట్టారు. ఒక్కో భవనానికి సుమారు రూ. 16 కోట్లు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది.

పనులు ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయి. వాస్తవానికి గత విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి భవనాలు అందుబాటులోకి వస్తాయని విద్యార్థుల తల్లిదండ్రులు భావించారు. నిధుల విడుదలలో జాప్యంతో సాధ్యం కాలేదు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికైనా నిర్మాణాలు పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ప్రస్తుతం 70 శాతం మేర పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులను రాబోయే మూడు నెలల్లో పూర్తి చేయించేలా అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు చేపట్టాల్సి ఉంది. నిపుణులైన ఉపాధ్యాయులను కేంద్ర ప్రభుత్వం గతేడాదే నియమించింది. భవనాల లేమి, వసతిసమస్య విద్యార్థులను తీవ్రంగా వేధిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని