logo

చంద్రబాబుతోనే రాష్ట్రానికి భవిష్యత్తు

రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని తెదేపా అరకు పార్లమెంట్‌ అధ్యక్షుడు కిడారి శ్రావణ్‌కుమార్‌, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి దొన్నుదొర అన్నారు.

Published : 24 Feb 2024 01:48 IST

అనంతగిరి, న్యూస్‌టుడే: రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని తెదేపా అరకు పార్లమెంట్‌ అధ్యక్షుడు కిడారి శ్రావణ్‌కుమార్‌, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి దొన్నుదొర అన్నారు. మండలంలోని కంటిపురం గ్రామంలో శుక్రవారం వారు పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వైకాపా పాలనలో రాష్ట్రం ఎన్నో ఏళ్లు వెనక్కు వెళ్లిపోయిందని విమర్శించారు. అభివృద్ధి జాడ కనిపించడం లేదని పేర్కొన్నారు. రహదారులన్నీ గుంతలమయంగా మారాయని చెప్పారు. గిరిజనులకు సంబంధించిన ఎన్నో సంక్షేమ పథకాలను వైకాపా ప్రభుత్వం నిలిపివేసిందని చెప్పారు. నిరుద్యోగులను ఆదుకునేందుకు ఎటువంటి చర్యలు చేపట్టలేదని పేర్కొన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ డీఎస్సీ అంటూ నిరుద్యోగులను మోసం చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్రం మళ్లీ అభివృద్ధి పథంలో నడవాలంటే తెదేపా-జనసేన ప్రభుత్వం రావాలని పేర్కొన్నారు. కార్యకర్తలు, నాయకులంతా సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. నేతలు బుజ్జిబాబు, ఆనంద్‌, లక్ష్మణ్‌, దాసుబాబు, అప్పారావు, దేముడు, అమ్మన్న, పాండురంగస్వామి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని