logo

ఇంటర్‌ విద్యార్థి బలవన్మరణం

వ్యసనాలకు బానిసైన ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడినట్లు పీఎంపాలెం సీఐ వై.రామకృష్ణ తెలిపారు. ఆ వివరాలిలా.. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలానికి చెందిన ఓ తాపీమేస్త్రి మధురవాడ వాంబే కాలనీలో భార్య, పిల్లలతో నివసిస్తున్నాడు.

Published : 29 Feb 2024 02:54 IST

విశాఖపట్నం, న్యూస్‌టుడే: వ్యసనాలకు బానిసైన ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడినట్లు పీఎంపాలెం సీఐ వై.రామకృష్ణ తెలిపారు. ఆ వివరాలిలా.. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలానికి చెందిన ఓ తాపీమేస్త్రి మధురవాడ వాంబే కాలనీలో భార్య, పిల్లలతో నివసిస్తున్నాడు. పెద్ద కుమారుడు(18) ప్రయివేటు కళాశాలలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. కొంత కాలంగా ఆన్‌లైన్‌ క్రీడలు, మద్యం తదితర దురలవాట్లకు బానిసయ్యాడు. ఈ క్రమంలో తోటి మిత్రుల వద్ద సైతం అప్పులు చేశాడు. ఈ నేపథ్యంలో కొంత కాలంగా కళాశాలకు వెళ్లకుండా చదువుకు దూరమయ్యాడు. బుధవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి పడక గదిలో ఫ్యాన్‌ హుక్కుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని