logo

గిరిజన రైతులు అధిక దిగుబడులు సాధించాలి

గిరిజన రైతులు ప్రభుత్వం అందిస్తున్న వ్యవసాయ ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకుని అధిక దిగుబడులు సాధించాలని ఐటీడీఏ పీఓ వి.అభిషేక్‌ అన్నారు.

Published : 29 Feb 2024 02:55 IST

నుర్మతి కొత్తూరు šషేడ్‌ నెట్‌ నిర్వాహకులతో మాట్లాడుతున్న పీఓ అభిషేక్‌, డీఆర్‌డీఏ పీడీ మురళి

జి.మాడుగుల, న్యూస్‌టుడే: గిరిజన రైతులు ప్రభుత్వం అందిస్తున్న వ్యవసాయ ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకుని అధిక దిగుబడులు సాధించాలని ఐటీడీఏ పీఓ వి.అభిషేక్‌ అన్నారు. బుధవారం నుర్మతి కొత్తూరు గ్రామంలో గొల్లోరి కృష్ణ అనే గిరిజన రైతు షేడ్‌ నెట్‌ కింద సాగు చేస్తున్న కూరగాయల సాగును పరిశీలించారు. రూ.4.63 లక్షల వ్యయంతో షెడ్‌ నెట్‌ మంజూరు చేసినట్లు డీఆర్‌డీఏ పీడీ మురళి పీఓకు చెప్పారు. లబ్ధిదారుని వాటాగా రూ.12 చెల్లించాలని చెప్పారు. రూ.1.98 లక్షల ఉద్యాన శాఖ రాయితీ అందించిందని పేర్కొన్నారు. మిగిలిన రూ.2.52 లక్షలను బ్యాంకు రుణం మంజూరు చేసిందని, ఆ రుణాన్ని రైతు ఆరు నెలల తరవాత వాయిదా పద్ధతిలో తిరిగి చెల్లించాలని వివరించారు. అనంతరం హుకుంపేట మండల కేంద్రంలోని రూ.15 లక్షల వ్యయంతో నిర్మించిన గిడ్డంగిని పరిశీలించారు. రైతులు పండిస్తున్న వ్యవసాయ ఉత్పత్తులను గిడ్డంగిలో భద్ర పరుచుకుని, గిట్టుబాటు ధర వచ్చినప్పుడు అధిక ఆదాయం పొందాలని పీఓ సూచించారు. ఏపీఎం వి.ఎస్‌.ప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు