logo

1.73 లక్షల మందికి రూ.35.27 కోట్ల లబ్ధి

రైతు భరోసా, సున్నా వడ్డీ రాయితీ కింద జిల్లాలో 1.73 లక్షల మంది రైతులకు రూ.35.27 కోట్ల లబ్ధి చేకూరిందని జాయింట్‌ కలెక్టర్‌ భావన పేర్కొన్నారు.

Published : 29 Feb 2024 03:03 IST

రైతులకు నమూనా చెక్కు అందిస్తున్న జేసీ భావన, జిల్లా వ్యవసాయాధికారి నంద్‌

పాడేరు, న్యూస్‌టుడే: రైతు భరోసా, సున్నా వడ్డీ రాయితీ కింద జిల్లాలో 1.73 లక్షల మంది రైతులకు రూ.35.27 కోట్ల లబ్ధి చేకూరిందని జాయింట్‌ కలెక్టర్‌ భావన పేర్కొన్నారు. వరుసగా ఐదో ఏడాది వైఎస్‌ఆర్‌ రైతు భరోసా పెట్టుబడి సాయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం నుంచి బటన్‌ నొక్కి రైతుల ఖాతాలకు బుధవారం జమ చేశారు. ఈ కార్యక్రమాన్ని జేసీ కలెక్టరేట్‌ నుంచి వీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రబీ 2021-22 ఆర్థిక సంవత్సరానికి 1119 మంది రైతులకు రూ.22.97 లక్షలు, ఖరీఫ్‌ 2022 సంవత్సరానికి సంబంధించి 2133 మంది రైతులకు రూ.43.78 లక్షల సున్నా వడ్డీని ప్రభుత్వం జమ చేసిందని పేర్కొన్నారు. జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌.బి.ఎస్‌.నంద్‌, జిల్లా ఉద్యాన అధికారి రమేష్‌ కుమార్‌ రావు, సహాయ సంచాలకులు శ్రీనివాస్‌, వ్యవసాయాధికారులు, పలువురు రైతులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని