logo

మేఘాలకొండ నిధులతో అభివృద్ధి పనులు

ప్రముఖ పర్యటక ప్రాంతమైన మేఘాలకొండ ద్వారా వస్తున్న ఆదాయంతో పరిసర గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. ఏటా మేఘాలకొండ అందాలను వీక్షించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి పెద్దఎత్తున పర్యటకులు తరలి వస్తున్నారు.

Published : 29 Feb 2024 03:04 IST

పాడేరు పట్టణం, న్యూస్‌టుడే

వంజంగి సమీపంలో రోడ్డు నిర్మాణం

ప్రముఖ పర్యటక ప్రాంతమైన మేఘాలకొండ ద్వారా వస్తున్న ఆదాయంతో పరిసర గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. ఏటా మేఘాలకొండ అందాలను వీక్షించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి పెద్దఎత్తున పర్యటకులు తరలి వస్తున్నారు. వారాంతంలో సుమారు ఐదువేల మంది వరకు సందర్శిస్తారు. స్థానిక ఐటీడీఏ ఆధ్వర్యంలో పర్యాటకుల నుంచి గేట్‌ ఫీజు కింద రుసుం వసూలు చేస్తున్నారు. ఈ సీజన్‌లో పర్యటకుల నుంచి ప్రవేశ రుసుం రూపంలో రూ. 25 లక్షల వరకు ఐటీడీఏ ఖాతాలో జమ అయ్యాయి. ఈ నిధులను వంజంగి కొండ పరిసరాల్లో గ్రామాల అభివృద్ధికి వెచ్చిస్తున్నారు. ప్రధానంగా వంజంగి పంచాయతీకి రూ. 13.1 లక్షలు, లగిశపల్లి పంచాయతీ పరిధిలో గ్రామాలకు రూ. 5.31 లక్షలు, కాడెలి పంచాయతీకి రూ.6.66 లక్షలు కేటాయించారు. మూడు పంచాయతీల్లో రూ. 7.2 లక్షలు ఖర్చు చేసి ప్రభుత్వ పాఠశాలలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. బొర్రమామిడి గ్రామంలో రూ. 2.41 లక్షలతో కల్వర్టు, పైప్‌లైన్‌ ఏర్పాటు, తాగునీటి సదుపాయం, సీసీ రోడ్ల నిర్మాణం, చిన్నిచిన్న కల్వర్టుల నిర్మాణానికి కేటాయించారు. సందర్శకుల సౌకర్యార్థం మరుగుదొడ్లు, సీసీ రోడ్ల నిర్మాణం, వసతి సదుపాయం కల్పించాలని పర్యటకులు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని