logo

Cyber crime: ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఢిల్లీరావు పేరుతో నకిలీ వాట్సప్‌

రోజుకో కొత్త పంథాలో సైబర్‌ నేరగాళ్ల మోసాలు పెరుగుతున్నాయి.

Updated : 25 Nov 2023 11:23 IST

అమరావతి: రోజుకో కొత్త పంథాలో సైబర్‌ నేరగాళ్ల మోసాలు పెరుగుతున్నాయి. ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఢిల్లీరావు పేరిట కొందరు దుండగులు మోసం చేసేందుకు చేసిన ప్రయత్నం తాజాగా వెలుగుచూడటం సంచలనం రేకెత్తించింది.  కలెక్టర్‌ ప్రొఫైల్‌ ఫొటో ఉన్న వాట్సప్‌తో కొందరు తహసీల్దార్‌లకు మెసేజ్‌లు చేశారు. అత్యవసరంగా డబ్బులు పంపాలని ఆ సందేశంలో పేర్కొన్నారు. దీంతో అప్రమత్తమైన అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉత్తరాదికి చెందిన సైబర్‌ నేరగాళ్ల పనిగా పోలీసుల అనుమానిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని