logo

బెజవాడ సిగలో స్కోచ్‌ అవార్డు

నగరంలో ఉత్పత్తవుతున్న వ్యర్థాలను వినియోగించి ఇంధనం తయారు చేస్తున్నందుకు గాను విజయవాడ నగరపాలక సంస్థకు స్కోచ్‌ అవార్డు దక్కింది.

Published : 26 Mar 2023 05:14 IST

పురస్కారం అందుకుంటున్న మేయర్‌ భాగ్యలక్ష్మి, చిత్రంలో అదనపు కమిషనర్‌ సత్యవతి

విజయవాడ నగరపాలక సంస్థ,న్యూస్‌టుడే: నగరంలో ఉత్పత్తవుతున్న వ్యర్థాలను వినియోగించి ఇంధనం తయారు చేస్తున్నందుకు గాను విజయవాడ నగరపాలక సంస్థకు స్కోచ్‌ అవార్డు దక్కింది. ఆ అవార్డును శనివారం దిల్లీలో జరిగిన కార్యక్రమంలో స్కోచ్‌ ఛైర్మన్‌ సమీర్‌ కొచ్చర్‌ నుంచి నగరపాలక సంస్థ మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, అదనపు కమిషనర్‌ కె.వి.సత్యవతి అందుకున్నారు. నగరంలో ఉత్పత్తవుతున్న 20 టన్నుల కూరగాయలు, పండ్ల వ్యర్థాలను వినియోగించి మెథనైజేషన్‌ గ్యాస్‌ను తయారు చేస్తున్నారు. దాని ద్వారా విద్యుదుత్పత్తి చేసి సింగ్‌నగర్‌లోని సీవరేజ్‌ ట్రీట్‌మెంట్‌ (ఎస్టీపీ) ప్లాంటుకు సరఫరా చేస్తున్నారు. ఫలితంగా నగరపాలక సంస్థకు నెలకు రూ.80 వేల విద్యుత్తు వ్యయం ఆదా అవుతోంది. ఈ మేరకు అధికారులు స్కోచ్‌ అవార్డు కోసం గతంలో దరఖాస్తు చేశారు. ఇటీవల పరిశీలించిన బృందం నగరపాలక సంస్థను సిల్వర్‌ స్కోచ్‌ అవార్డుకు ఎంపిక చేసింది. అవార్డును అందుకున్న మేయర్‌, అదనపు కమిషనర్‌ శనివారం రాత్రికి తిరిగి నగరానికి చేరుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని