logo

ఉయ్యూరులో జోగి ఉక్కిరిబిక్కిరి

ఉయ్యూరు జెమిని ప్రాంతంలో సోమవారం టిడ్కో గృహ సమూదాయాల ప్రాంగణంలో ఏర్పాటైన లబ్ధిదారుల సభలో మహిళలు మంత్రి జోగి రమేష్‌ను తమ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేశారు.

Updated : 27 Feb 2024 09:23 IST

ఇంటి కోసం ఇంకెన్నేళ్లు ఎదురు చూడాలని మంత్రిని ప్రశ్నిస్తున్న సూర్యకుమారి

య్యూరు జెమిని ప్రాంతంలో సోమవారం టిడ్కో గృహ సమూదాయాల ప్రాంగణంలో ఏర్పాటైన లబ్ధిదారుల సభలో మహిళలు మంత్రి జోగి రమేష్‌ను తమ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేశారు. టిడ్కో ఇళ్ల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నామని ఇంకెప్పుడు తమ కల నెరువేరుతుందని నిలదీశారు. ఇళ్ల రిజిస్ట్రేషన్లు కాకుండానే బ్యాంకు వాళ్లు రుణాలు తీసుకున్నామని తమకు నోటీసులు ఇస్తున్నారని ఇదేమి తీరని ప్రశ్నించారు. తాము ఇలా ఇబ్బందులు పడడానికి వైకాపా ప్రభుత్వమే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా పలువురు మహిళలు అడిగిన ప్రశ్నలకు మంత్రి జోగి రమేష్‌ సరైన సమాధానం చెప్పలేకపోయారు. చివరకు ఇళ్లు ఇవ్వకపోవడానికి స్థానిక ఎమ్మెల్యే పార్థసారథే కారణమని చెప్పడం గమనార్హం. మరోవైపు పోలీసులు సైతం అత్యుత్సాహం ప్రదర్శించారు. తెదేపా నేతలను సభలో నుంచి బలవంతంగా లాక్కెళ్లారు.తన కుటుంబపరమైన సాధారణ సమస్యను మంత్రి జోగి రమేష్‌కు వివరించేందుకు ప్రయత్నించిన ఓ మహిళను సైతం పోలీసులు చుట్టుముట్టి ఆమెను కదలనీయకుండా చేశారు. మంత్రిని కలవడానికి కుదరదంటూ ఆమెను పక్కకు పంపేశారు.

కౌన్సిలరు సుధారాణిని లాక్కెళుతున్నారిలా..

నాయకురాలు కొల్లా లక్ష్మిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

సమస్య తెలిపేందుకు వచ్చిన మహిళను నిలువరించిన ఖాకీలు

న్యూస్‌టుడే, ఉయ్యూరు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని