logo

అమ్మాయిలదే హవా..

ఇంటర్‌ మొదటి, రెండో ఏడాది ఫలితాల్లో రాష్ట్రంలోని 26 జిల్లాల్లో కృష్ణా మొదటి స్థానంలో నిలిచింది.

Published : 13 Apr 2024 04:33 IST

తొలి ఏడాది 84 .. రెండో ఏడాది 90 శాతం ఉత్తీర్ణత
ఇంటర్‌లో జిల్లాకు తృతీయ స్థానం

ఈనాడు, అమరావతి: ఇంటర్‌ మొదటి, రెండో ఏడాది ఫలితాల్లో రాష్ట్రంలోని 26 జిల్లాల్లో కృష్ణా మొదటి స్థానంలో నిలిచింది. గత ఏడాది వరకూ ఎన్టీఆర్‌తో కలిసి ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు కూడా గత దశాబ్దానికి పైగా కృష్ణా ప్రథమ స్థానంలోనే నిలుస్తూ వచ్చింది. ఈ ఏడాది నుంచి కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల ఇంటర్‌ ఫలితాలను వేర్వేరుగా విద్యాశాఖ విడుదల చేసింది. ఇప్పుడు కూడా కృష్ణా జిల్లా అగ్రపథంలోనే నిలిచి.. తన జైత్రయాత్రను కొనసాగించింది. ఈసారి కూడా మొదటి ఏడాది ఫలితాల్లో అమ్మాయిలే.. అబ్బాయిల కంటే పైచేయి సాధించారు. రెండో ఏడాది ఫలితాల్లో మాత్రం.. ఇద్దరూ పోటాపోటీగా 90 శాతం మంది చొప్పున ఉత్తీర్ణత సాధించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని