logo

వైకాపాకు ‘బొకినాల’ రాజీనామా

బాపులపాడు మండలం మల్లవల్లికు చెందిన వైకాపా నాయకుడు బొకినాల సాంబశివరావు ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు.

Published : 17 Apr 2024 04:08 IST

హనుమాన్‌జంక్షన్‌, న్యూస్‌టుడే: బాపులపాడు మండలం మల్లవల్లికు చెందిన వైకాపా నాయకుడు బొకినాల సాంబశివరావు ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. గతంలో దుట్టా అనుచరుడిగా ఉన్న తాను, వల్లభనేని వంశీ ప్రోత్సాహంతో తెదేపాలో చేరానని, ఆ తర్వాత ఆయనతో పాటే వైకాపాలోకి వచ్చి నాలుగున్నరేళ్లు కష్టపడి పనిచేశానన్నారు. మల్లవల్లిలో ఏపీఐఐసీ భూములు తీసుకున్న సమయంలో తనకు పరిహారం రాలేదని, ఎమ్మెల్యేగా ఉన్న వంశీ న్యాయం చేస్తానని చెప్పి ఏమీ చేయలేదన్నారు. పైగా తన భూములకు సంబంధించి జరుగుతున్న వివాదాల్లో ప్రత్యర్థి వర్గం వారికి ఎమ్మెల్యే కార్యాలయం అండగా నిలిచిందన్నారు. వైకాపా మండల అధ్యక్షుడు నక్కా గాంధీ కూడా న్యాయం చేస్తానని చెప్పి మోసగించారన్నారు. అందుకే రాజీనామా చేస్తున్నానని, త్వరలో ఏ పార్టీలో చేరేది వెల్లడిస్తానన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని