logo

శరత్‌చంద్ర ఐఏఎస్‌ అకాడమీ విద్యార్థుల ప్రతిభ

సివిల్స్‌ ఫలితాల్లో శరత్‌ చంద్ర ఐఏఎస్‌ అకాడమీ హైదరాబాద్‌, విజయవాడ శాఖల్లో శిక్షణ తీసుకున్న విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించారని...

Published : 17 Apr 2024 04:17 IST

రుహానితో శరత్‌ చంద్ర

బెంజిసర్కిల్‌(విజయవాడ సిటీ), న్యూస్‌టుడే : సివిల్స్‌ ఫలితాల్లో శరత్‌ చంద్ర ఐఏఎస్‌ అకాడమీ హైదరాబాద్‌, విజయవాడ శాఖల్లో శిక్షణ తీసుకున్న విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించారని మేనేజింగ్‌ డైరెక్టర్‌ తోట శరత్‌చంద్ర మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆల్‌ ఇండియా స్థాయిలో అనన్యరెడ్డి 3, రుహాని 5వ ర్యాంకు సాధించారని చెప్పారు. 16, 19, 42, 61, 91 ర్యాంక్‌లతో పాటు 50కి పైగా ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఆర్‌ఎస్‌ ర్యాంకులు కైవసం చేసుకున్నట్లు వివరించారు. అందులో 19 ర్యాంకులు తెలుగు విద్యార్థులకు వచ్చినట్లు తెలిపారు. సింగరాయకొండకు చెందిన ఉదయ్‌రెడ్డి తెలుగు మాధ్యమంలో డిగ్రీ చదువుకొని కానిస్టేబుల్‌గా చేస్తూ 780వ ర్యాంకు సాధించారని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని