logo

‘జగన్‌ హయాంలో కార్మికులకు ఉపాధి కరవు’

జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కార్మికులకు ఉపాధి కరవైందని తెదేపా జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘురామ్‌ అన్నారు. విజయవాడ గురునానక్‌ రోడ్డులోని ఎన్‌ఏసీ కల్యాణ మండపంలో మంగళవారం

Published : 17 Apr 2024 04:43 IST

వేదికపై నెట్టెం రఘురామ్‌, శివనాథ్‌, గద్దె, బోడే తదితరులు

కరెన్సీనగర్‌, న్యూస్‌టుడే: జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కార్మికులకు ఉపాధి కరవైందని తెదేపా జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘురామ్‌ అన్నారు. విజయవాడ గురునానక్‌ రోడ్డులోని ఎన్‌ఏసీ కల్యాణ మండపంలో మంగళవారం ఆటోనగర్‌ అనుబంధ సంఘాలు, రవాణారంగ మిత్రులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. నెట్టెం మాట్లాడుతూ తెదేపా చిత్తశుద్ధికి ప్రతీక అని, అటువంటి పార్టీకి అండగా ఉండాలని కోరారు. ఎన్టీఆర్‌, చంద్రబాబు హయాంలోనే రాష్ట్రాభివృద్ధి జరిగిందని గుర్తు చేశారు. జగన్‌ మూడు రాజధానులంటూ ఆటోనగర్‌లోని లక్షలాది మంది కార్మికులకు పనులు లేకుండా చేశారని వాపోయారు. జీవో 5, 6 రద్దు చేస్తామని విజయవాడ పార్లమెంటు అభ్యర్థి కేశినేని శివనాథ్‌ అన్నారు. ఐలా ఎన్నికలను జగన్‌ గాలికి వదిలేశారని విమర్శించారు. తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్‌ మాట్లాడుతూ... అధికారంలోకి రాగానే ఎన్నికలు నిర్వహించి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. పెనమలూరు తెదేపా అభ్యర్థి బోడే ప్రసాద్‌, టీఎన్‌టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు గొట్టుముక్కల రఘురామరాజు, మోటార్‌ కార్పెంటర్‌ సంఘం అధ్యక్షుడు వి.లక్ష్మీనారాయణ, ఆటోనగర్‌ మెకానిక్‌ యూనియన్‌ కార్యదర్శి దస్తగిరి, పెయింట్స్‌ సంఘం కార్యదర్శి వీరాచారి, లారీ ఓనర్స్‌ సంఘం అధ్యక్షుడు వై.వి.ఈశ్వరరావు, అమరావతి కార్ల సంఘం అధ్యక్షుడు దివాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని