logo

బావిలో పడిన యువకుడు

బాపులపాడు మండలం బొమ్ములూరులో ఓ యువకుడు బావిలో పడిన ఘటన గురువారం రాత్రి కలకలం రేపింది. ఇదే గ్రామానికి చెందిన పవన్‌ స్థానిక విద్యుత్తు ఉపకేంద్రం సమీపంలో ఉన్న పొలంలోని బావిలో పడిపోయాడు.

Published : 19 Apr 2024 04:59 IST

హనుమాన్‌జంక్షన్‌, న్యూస్‌టుడే: బాపులపాడు మండలం బొమ్ములూరులో ఓ యువకుడు బావిలో పడిన ఘటన గురువారం రాత్రి కలకలం రేపింది. ఇదే గ్రామానికి చెందిన పవన్‌ స్థానిక విద్యుత్తు ఉపకేంద్రం సమీపంలో ఉన్న పొలంలోని బావిలో పడిపోయాడు. ఇతడి అరుపులతో సమీపంలోని రైతులు బావి వద్దకు వచ్చి చూసి లోపల ఎవరో పడిపోయినట్లు గమనించారు. దీంతో పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అధికార్లు, సిబ్బంది 150 అడుగుల లోతు ఉన్న బావిలోకి సిబ్బందిని దింపి తాళ్లతో లాగి పవన్‌ను పైకి తీసుకు వచ్చారు. ఇతడు ప్రమాదవశాత్తూ పడలేదని, బావి వద్ద రాగి తీగలు అపహరించేందుకు వచ్చాడనే ప్రచారం జరుగుతోంది. గ్రామంలో ఇటీవల వరుసగా బోర్ల వద్ద చోరీలు జరిగినట్లు కూడా స్థానికులు చెబుతున్నారు. విచారణ చేపట్టినట్లు ఎస్సై జనార్దన్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని