logo

నాట్యప్రయోగిక పరీక్షలు

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, సిద్ధేంద్రయోగి కూచిపూడి నాట్య కళాపీఠంలో మాస్టర్‌ పెర్ఫార్మింగ్‌ ఆర్ట్స్‌ (ఎంపీఏ) కూచిపూడి నృత్యం రెండు, నాలుగో సెమిష్టర్‌ పరీక్షలు ప్రారంభమయ్యాయి.

Published : 20 Apr 2024 05:25 IST

కూచిపూడి, న్యూస్‌టుడే: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, సిద్ధేంద్రయోగి కూచిపూడి నాట్య కళాపీఠంలో మాస్టర్‌ పెర్ఫార్మింగ్‌ ఆర్ట్స్‌ (ఎంపీఏ) కూచిపూడి నృత్యం రెండు, నాలుగో సెమిష్టర్‌ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 27 వరకూ పరీక్షలు కొనసాగుతాయి. శుక్రవారం ఎంపీఏ కూచిపూడి నాట్యం రెండో సెమిస్టర్‌కు 17 మంది, నాలుగో సెమిస్టర్‌కు 8 మంది విద్యార్థులు హాజరయ్యారు. సూపరింటెండెంట్‌ వేదాంతం రామలింగశాస్త్రి, పూర్ణచంద్రరరావు(మచిలీపట్నం) పర్యవేక్షించారు. గాత్రానికి వేదాంతం దుర్గాభవాని, నట్టువాంగానికి డాక్టర్‌ ఏలేశ్వరపు శ్రీనివాసులు, మృదంగానికి పసుమర్తి హరనాథశాస్త్రి సహకరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు