కూటమి కోలాహలం.. నగరం పసుపుమయం
ఎన్టీయే కూటమి అభ్యర్థిగా కేశినేని శివనాథ్ (చిన్ని) నామినేషన్‌తో విజయవాడ నగరం పసుపు మయంగా మారింది.
తెదేపా, జనసేన, భాజపా కార్యకర్తల సందడి
ఎన్టీఆర్ కలెక్టరేట్, న్యూస్‌టుడే : ఎన్టీయే కూటమి అభ్యర్థిగా కేశినేని శివనాథ్ (చిన్ని) నామినేషన్‌తో విజయవాడ నగరం పసుపు మయంగా మారింది. ఉదయం 9 గంటలకే కనకదుర్గ గుడిలో కేశినేని చిన్ని దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. సమీపంలోని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న నివాసంలో అల్పాహారం చేశారు. కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. అనంతరం ప్రకాశం బ్యారేజీ వద్ద దర్గాలో ప్రార్థనలు నిర్వహించారు. మైనార్టీ నాయకులు ఎం.ఎస్.బేగ్, నాగుల్ మీరా, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, గుడివాడ తెదేపా అభ్యర్థి వెనిగండ్ల రాము తదితరులు హాజరయ్యారు. అక్కడి నుంచి ద్విచక్ర వాహనాలతో కంట్రోల్ రూం వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. శ్రేణులు కదం తొక్కడంతో.. దాదాపు రెండు గంటల సమయం పట్టింది. తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. యునైటెడ్ క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పాస్టర్లు ప్రార్థనలు చేశారు. కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షుడు అప్పికట్ల జవహర్ ఆధ్వర్యంలో వేలాది మంది క్రైస్తవులు మద్దతుగా ర్యాలీలో పాల్గొన్నారు. పాస్టర్ కాటూరి మోజెస్, పాస్టర్ సతీష్, ఏసురత్నం, జాన్‌కుమార్, జకరయ్య తదితరులు ప్రార్థనలు చేసి చిన్ని విజయాన్ని కాంక్షించారు. మోజెస్ జపమాలను, జవహర్ ఏసుక్రీస్తు ప్రతిమను కేశినేని శివనాథ్‌కు బహూకరించారు. అక్కడి నుంచి కంట్రోల్ రూం మీదుగా కలెక్టరేట్ ప్రాంగణానికి ర్యాలీ చేరుకున్నారు.
టీఎన్టీయూసీ కార్యకర్తల జోష్
లంబాడీ మహిళల నృత్య ప్రదర్శన
జనసేన కార్యకర్త హుషారు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
[ 27-07-2024]
కృష్ణానది తీరాన కొండల్లో వజ్రాల కోసం జనం వెతుకులాట కొనసాగుతోంది. వర్షాలు పడుతుండటంతో వజ్రాలు దొరుకుతాయనే ఆశతో సుదూర ప్రాంతాల నుంచి జనం వస్తున్నారు -
ఏటికో లెక్క.. ఏమిటో మాయ!
[ 27-07-2024]
అదే సర్వేనెంబరు 5-4లో ఫసలీ 1428 వచ్చే నాటికి మొత్తం విస్తీర్ణం కేవలం 28.70 ఎకరాలుగా అదే అధికారులు ధ్రువీకరిస్తూ.. అడంగల్ కాపీ జారీ చేశారు. ఇక్కడ మొత్తం ఆరుగురే పట్టాదారులు ఉన్నారు. -
అశోక్ లేల్యాండ్ ప్రారంభానికి అడుగులు
[ 27-07-2024]
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో నెలకొల్పిన అశోక్ లేల్యాండ్ బస్సు బాడీ బిల్డింగ్ యూనిట్ త్వరలో ప్రారంభం కాబోతుంది -
సైబర్ నేరం.. అవగాహనతో దూరం
[ 27-07-2024]
సైబర్ నేరాలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఏ క్షణంలో ఏ మార్గంలో ఖాతా నుంచి డబ్బులు మాయమవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. -
కీలక విభాగాల్లో.. తక్షణం స్పందించేలా..!
[ 27-07-2024]
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో రోగులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు ఆరంభమయ్యాయి. కొత్త, పాతాసుపత్రుల్లోని కీలకమైన విభాగాల్లో ఉండే వైద్యాధికారులు, సిబ్బంది.. నిత్యం రోగులు, వారి బంధువులకు అందుబాటులో ఉండేలా కనెక్టివిటీని తాజాగా ఏర్పాటు చేశారు. -
డాక్టర్ శ్రీహరిరావు హత్య కేసు సీబీసీఐడీకి అప్పగింత
[ 27-07-2024]
అవనిగడ్డలో దాదాపు మూడున్నర సంవత్సరాల కిందట జరిగిన డాక్టర్ కోట శ్రీహరిరావు హత్యకేసు విచారణను రాష్ట్ర ప్రభుత్వం సీబీసీఐడీకి అప్పగించినట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. -
అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో దేశం కోసం పోరాడి పాకిస్థాన్‌పై విజయం సాధించడంలో అసువులు బాసిన వీర సైనికుల త్యాగాలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని జిల్లా సైనిక సంక్షేమాధికారి డాక్టర్ కె.కల్యాణవీణ పేర్కొన్నారు -
గగన వీధిలో.. ఘనమై ఎగిరేలా..‘
[ 27-07-2024]
గన్నవరం విమానాశ్రయానికి.. ప్రయాణికుల రద్దీ పుష్కలంగా ఉంది. ఇక్కడి నుంచి ఏ దేశం, నగరానికి కొత్త సర్వీసులు ఏర్పాటు చేసినా.. అవి అత్యంత రద్దీగా నడుస్తుండడమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. -
రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్‌సిటీ, న్యూస్‌టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్‌సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్‌రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే