logo

కళాశాల అభివృద్ధిపై నిర్లక్ష్యం

పెడన నియోజకవర్గంలో ఉన్న ఏకైక బంటుమిల్లిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల అభివృద్ధికి అమడ దూరంలో ఉంది. ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా ఇక్కడ సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. దీనిని 1997లో ప్రారంభించారు.

Published : 19 May 2024 03:37 IST

బంటుమిల్లి, న్యూస్‌టుడే

ప్రభుత్వ డిగ్రీ కళాశాల

పెడన నియోజకవర్గంలో ఉన్న ఏకైక బంటుమిల్లిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల అభివృద్ధికి అమడ దూరంలో ఉంది. ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా ఇక్కడ సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. దీనిని 1997లో ప్రారంభించారు. నాటి నుంచి ఈ కళాశాల బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాల్లో ఎంతోమంది విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దింది. వైకాపా ప్రభుత్వం గత ఐదేళ్లుగా కళాశాల కోసం చేసిందీమీ లేదు. ప్రధానంగా కళాశాలకు ప్రహారీ నిర్మించాల్సి ఉంది. అదే విధంగా విద్యార్థులకు సరిపడ మూత్రశాలలు, మరుగుదొడ్లు లేవు. వీటిని మరికొన్ని నిర్మించాల్సి ఉంది. గతంలో ఉన్న శిథిల భవనాలు ప్రాంగణంలోనే ఉన్నాయి. వాటిని తొలగించడంలో జాప్యం చేస్తున్నారు. డిజిటల్‌ గ్రంథాలయం ఏర్పాటు చేస్తే విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని విద్యార్థి సంఘాల నాయకులు అంటున్నారు. ప్రస్తుతం ఇక్కడ బీఏ, బీకాం, బీకాం కంప్యూటర్స్‌ వంటి కోర్సులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ప్రజా ప్రతినిధులు స్పందించి ఇక్కడ అన్ని రకాల సైన్స్, ఆర్ట్స్, కామర్స్‌ కోర్సులు కూడా పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావడంతో పాటు ఆ కోర్సులకు అనుగుణంగా అధ్యాపకులను నియమించాలని రెండు మండలాల ప్రజలు  కోరుతున్నారు.

ప్రాంగణంలోనే శిథిల భవనం

ప్రహారీ లేని మైదానం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని