logo

పవర్‌ లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌ నేడు

ఎన్టీఆర్‌ జిల్లా పవర్‌ లిఫ్టింగ్‌ సంఘం ఆధ్వర్యంలో సోమవారం తిరువూరు సాయిబాబా కల్యాణ మండపంలో ఉమ్మడి కృష్ణా జిల్లా స్థాయి పవర్‌ లిఫ్టింగ్‌ పోటీలు నిర్వహిస్తామని ఆ సంఘం కార్యదర్శి వి.మల్లేశ్వరరావు తెలిపారు.

Published : 20 May 2024 03:19 IST

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే:  ఎన్టీఆర్‌ జిల్లా పవర్‌ లిఫ్టింగ్‌ సంఘం ఆధ్వర్యంలో సోమవారం తిరువూరు సాయిబాబా కల్యాణ మండపంలో ఉమ్మడి కృష్ణా జిల్లా స్థాయి పవర్‌ లిఫ్టింగ్‌ పోటీలు నిర్వహిస్తామని ఆ సంఘం కార్యదర్శి వి.మల్లేశ్వరరావు తెలిపారు. ఈ ఛాంపియన్‌షిప్‌లో సబ్‌ జూనియర్, జూనియర్, సీనియర్‌ (స్త్రీ, పురుషులు), మాస్టర్స్‌ (40+)విభాగాల్లో వేర్వేరుగా పోటీలు ఉంటాయన్నారు. క్రీడాకారులకు మధ్యాహ్నం ఉచిత భోజన సదుపాయం కల్పిస్తామన్నారు. ఆసక్తిగల క్రీడాకారులు ఉదయం 9 గంటలలోపు వేదిక వద్దకు చేరుకోవాలని కోరారు.

21 నుంచి రాష్ట్ర స్థాయి బాస్కెట్‌బాల్‌ పోటీలు

విజయవాడ క్రీడలు: విజయవాడ మారిస్‌ స్టెల్లా కళాశాల మైదానంలో ఈ నెల 21 నుంచి నాలుగు రోజుల పాటు 7వ రాష్ట్ర స్థాయి అంతర్‌ జిల్లాల యూత్‌ (అండర్‌-17) బాలబాలికల బాస్కెట్‌బాల్‌ ఛాంపియన్‌షిప్‌ నిర్వహించనున్నట్లు ఉమ్మడి కృష్ణా జిల్లా బాస్కెట్‌బాల్‌ సంఘం అధ్యక్షుడు గుత్తికొండ సుభాష్‌ చంద్రబోస్‌ తెలిపారు. పోటీలు లీగ్‌ కమ్‌ నాకౌట్‌ పద్ధతిలో ఉంటాయన్నారు. ఇండోర్, ఔట్‌ డోర్‌ మైదానాల్లో రెండు కోర్టులు సిద్ధం చేశామని, ప్రతిభ చూపినవారిని రాష్ట్ర జట్టుకు ఎంపిక చేస్తామని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని