logo

అక్రమార్కులపై ఔదార్యం ఎందుకో..!

ఇసుక అక్రమార్కులపై పోలీసు, రెవెన్యూ అధికారులు ఎనలేని ఔదార్యం చూపిస్తున్నారు.

Published : 20 May 2024 03:24 IST

కీసర స్టాకు యార్డు వద్ద ఇసుక లోడింగ్‌ యంత్రం

ఇసుక అక్రమార్కులపై పోలీసు, రెవెన్యూ అధికారులు ఎనలేని ఔదార్యం చూపిస్తున్నారు. గత రెండు రోజులుగా కీసర సమీపంలోని స్టాక్‌ యార్డు నుంచి జరుగుతున్న అక్రమ రవాణాపై పత్రికల్లో కథనాలు రావడంతో దిద్దుబాటు చర్యలు చేపట్టిన అధికారులు కేవలం నామమాత్రపు చర్యలతో సరిపెడుతున్నారు. ఈ నెల 18వ తేదీ రాత్రి కీసర స్టాక్‌ యార్డు నుంచి ఇసుక రవాణా చేస్తున్న ఓ లారీని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. కానీ యార్డు వద్ద ఇసుక లోడింగ్‌ చేసే యంత్రాన్ని మాత్రం వదిలివేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆ యంత్రం నియోజకవర్గ అధికార పార్టీ ముఖ్య నేత సన్నిహితుడిది కావడంతోనే దాన్ని వదిలి కేవలం రవాణా చేస్తున్న వాహనాన్ని పట్టుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇసుక అక్రమ రవాణాపై రెవెన్యూ అధికారులు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తుండడం గమనార్హం.

న్యూస్‌టుడే, కంచికచర్ల

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని