logo

ఓటమి భయంతోనే ముందస్తు దాడులు

గన్నవరం నియోజకవర్గంలో ఓటమి ఖాయమని తేలడంతోనే పోలింగ్‌ సందర్భంగా వైకాపా మూకలు ముందస్తు అల్లర్లు, దాడులకు దిగాయని తెదేపా అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు పేర్కొన్నారు.

Published : 20 May 2024 03:33 IST

గోపాలకృష్ణను పరామర్శిస్తున్న యార్లగడ్డ వెంకట్రావు తదితరులు

హనుమాన్‌జంక్షన్, న్యూస్‌టుడే : గన్నవరం నియోజకవర్గంలో ఓటమి ఖాయమని తేలడంతోనే పోలింగ్‌ సందర్భంగా వైకాపా మూకలు ముందస్తు అల్లర్లు, దాడులకు దిగాయని తెదేపా అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు పేర్కొన్నారు. ఈ తరహా దాడులు ప్రజాస్వామ్యంలో హేయమని, ఇలాంటి వాటికి త్వరలోనే శాశ్వతంగా అడ్డుకట్ట పడనుందన్నారు. ఈ నెల 13న కొత్తమల్లవల్లిలో పోలింగ్‌ పర్యవేక్షణకు వెళ్లిన తెదేపా నాయకుడు ఆళ్ల గోపాలకృష్ణపై వైకాపా వర్గీయుల దాడిని ఆయన ఖండించారు. ఆదివారం రంగన్నగూడెంలోని ఆళ్ల నివాసానికి వచ్చి వివరాలు తెలుసుకున్నారు. పోలింగ్‌ ఆరంభం నుంచే నియోజకవర్గంలో కూటమి అభ్యర్థులకు అత్యంత సానుకూల స్పందన కన్పించడంతో, ఓటింగ్‌కు ఆటంకం కల్గించేందుకు వైకాపా నాయకులు ప్రయత్నించారని ఆరోపించారు. కానీ ఓటర్లు ఎంతో ధైర్యంగా తమ భవిష్యత్తు కోసం ఓటు వేయడానికి మొగ్గుచూపారన్నారు. తాను, మచిలీపట్నం జనసేన ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి భారీ ఆధిక్యంతో గెలవడం ఖాయమని పేర్కొన్నారు. తొలుత యార్లగడ్డకు సర్పంచి కసుకుర్తి రంగామణి, మాజీ సర్పంచి ఆళ్ల మణికృష్ణ, మహిళా నాయకురాలు దోనవల్లి నాగశిరోమణి ఆధ్వర్యంలో స్వాగతం పలికారు. ఎంపీటీసీ సభ్యుడు పుసులూరి లక్ష్మీనారాయణ, ఉపసర్పంచి బెజవాడ వెంకట కృష్ణారావు, నాయకులు మొవ్వా వేణుగోపాల్, తుమ్మల దశరథరామయ్య, మొవ్వా శ్రీనివాసరావు, పలగాని వీరాంజనేయులు, గరికపాటి శంకర్, కనకవల్లి శేషగిరిరావు, మందపాట రాంబాబు, కసుకుర్తి కిశోర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు