logo

వివాదాల పరిష్కారానికి మధ్యవర్తిత్వం దోహదం

కుటుంబ తగాదాలు, ఆస్తి వివాదాల పరిష్కారానికి మధ్యవర్తిత్వం ఉపయోగపడుతుందని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర న్యాయసేవాధికారి సంస్థ సభ్య కార్యదర్శి ఎం.బబిత పేర్కొన్నారు.

Published : 21 May 2024 05:03 IST

మాట్లాడుతున్న ఎం.బబిత. వేదికపై ఎ.సత్యానంద్, హరీష్‌ మడాని, నగీనా జైన్‌

విజయవాడ నేరవార్తలు, న్యూస్‌టుడే : కుటుంబ తగాదాలు, ఆస్తి వివాదాల పరిష్కారానికి మధ్యవర్తిత్వం ఉపయోగపడుతుందని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర న్యాయసేవాధికారి సంస్థ సభ్య కార్యదర్శి ఎం.బబిత పేర్కొన్నారు. సోమవారం గాంధీనగర్‌లోని ఓ హోటల్‌లో జ్యుడీషియల్‌ ఆఫీసర్లకు మధ్యవర్తిత్వంపై శిక్షణ తరగతులను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎం.బబిత మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు మీడియేషన్, కన్సలియేషన్‌ ప్రాజెక్టు కమిటీ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల మేరకు జ్యుడిషియల్‌ ఆఫీసర్లకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 20 నుంచి 24 వరకు మొత్తం 5 రోజుల పాటు విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, తిరుపతిలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. కేసులను త్వరితగతిన పరిష్కరించుకోవడమే మధ్యవర్తిత్వం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. కక్షిదారులు ఈ కార్యక్రమాన్ని వినియోగించుకుని.. తమ కేసులను పరిష్కరించుకోవాలని సూచించారు. దిల్లీ హైకోర్టు నుంచి వచ్చిన శిక్షకులు హరీష్‌ మడాని, నగీనా జైన్‌లు రిసోర్స్‌ పర్సన్‌లుగా వ్యవహరించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో విజయవాడ మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి ఎ.సత్యానంద్, ఏపీ న్యాయసేవాధికార సంస్థ ఏవో హెచ్‌.అమరరంగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని