logo

అరుణాచలానికి ప్రత్యేక బస్సు

ప్రతి పౌర్ణమికి అరుణాచలానికి మచిలీపట్నం నుంచి ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసినట్లు మచిలీపట్నం ఆర్టీసీ డిపో మేనేజర్‌ టి.పెద్దిరాజు అన్నారు.

Published : 21 May 2024 05:04 IST

ప్రయాణికుల సమస్యలు నమోదు చేసుకుంటున్న డీఎం

మచిలీపట్నం కార్పొరేషన్, న్యూస్‌టుడే: ప్రతి పౌర్ణమికి అరుణాచలానికి మచిలీపట్నం నుంచి ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసినట్లు మచిలీపట్నం ఆర్టీసీ డిపో మేనేజర్‌ టి.పెద్దిరాజు అన్నారు. సోమవారం నిర్వహించిన డయల్‌ యువర్‌ డీఎం కార్యక్రమంలో వివిధ ప్రాంతాలకు చెందిన ప్రయాణికులు ఫోన్‌లో తమ అవసరాలు, సమస్యలు తెలియజేయగా వాటిని నమోదు చేసుకుని పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆయన మాట్లాడుతూ ఈ నెల 21న సాయంత్రం 5 గంటలకు బస్సు అరుణాచలం బయలు దేరుతుందన్నారు. రేపల్లె, శ్రీకాళహస్తి, కాణీపాకం, అర్ధవీడు, సిరిపురం మీదుగా అరుణాచలం చేరుకుంటుందని అన్నారు. గిరిప్రదక్షిణ అనంతరం కంచి, తిరుత్తణి తదితర  పుణ్యక్షేత్రాలను దర్శించుకుని 25న మచిలీపట్నం చేరుకుంటుందన్నారు.  మచిలీపట్నం నుంచి బంటుమిల్లి మీదుగా భీమవరానికి ఓ బస్సు ఏర్పాటు చేయాలని, మచిలీపట్నం, బంటుమిల్లి, కృత్తివెన్ను, భీమవరం మీదుగా కాకినాడకు ఉండే బస్సును, విజయనగరం, పార్వతీపురం బస్సులను పునరుద్ధరించాలని పలువురు ప్రయాణికులు కోరారు. దీనిపై డీఎం మాట్లాడుతూ బంటుమిల్లి మీదుగా కాకినాడ బస్సును గవర్నర్‌పేట డిపో నుంచి వచ్చేదని, ప్రయాణికుల విజ్ఞప్తిని అక్కడి అధికారుల దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. ప్రయాణికులు అవసరాలకు అనుగుణంగా కావాల్సిన సర్వీసులు  ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రయాణికులు అందరూ ఆర్టీసీని వినియోగించుకోవాలని కోరారు. బృందంగా వస్తే పలు పుణ్య క్షేత్రాలకు కూడా ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేస్తామన్నారు. వివిధ ప్రాంతాల్లో సర్వీసులు ఉన్నాయని, అవసరాన్ని బట్టి సమయాల్లో మార్పులు చేయడంతో కొత్త సర్వీసులు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని