logo

ఏపీ నరెడ్కో నూతన కార్యవర్గం ఎన్నిక

నేషనల్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సెల్‌ (నరెడ్కో) ఆంధ్రప్రదేశ్‌ శాఖ నూతన కార్యవర్గాన్ని సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గవర్నర్‌పేటలోని ఓ హోటల్‌లో నిర్వహించిన సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు...

Published : 21 May 2024 05:06 IST

ఎంపికైన కార్యవర్గ సభ్యులు

విజయవాడ (గవర్నర్‌పేట), న్యూస్‌టుడే : నేషనల్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సెల్‌ (నరెడ్కో) ఆంధ్రప్రదేశ్‌ శాఖ నూతన కార్యవర్గాన్ని సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గవర్నర్‌పేటలోని ఓ హోటల్‌లో నిర్వహించిన సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు ఎన్నికల అధికారి జి.తిరుపతిరావు వెల్లడించారు. నరెడ్కో ఏపీ ఛైర్మన్‌గా జి.హరిబాబు, అధ్యక్షుడిగా గద్దె చక్రధర్, ప్రధాన కార్యదర్శిగా ఎం.సీతారామయ్య, కోశాధికారిగా చావా రమేష్‌బాబు, కార్యనిర్వాహక అధ్యక్షులుగా పరుచూరి కిరణ్‌కుమార్, వై.దుర్గాప్రసాద్, తాళ్లూరి శివాజీతో పాటు ఐదుగురు ఉపాధ్యక్షులు, ఆరుగురు కార్యదర్శులు, 21 మంది గవర్నింగ్‌ కౌన్సెల్‌ సభ్యులను ఎన్నుకున్నారు. వీరు 2024-2026 సంవత్సరాల కాలంలో నిర్మాణ రంగానికి సేవలు అందిస్తారని తెలిపారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని