logo

ఈవీఎంల భద్రతపై అప్రమత్తంగా ఉండండి

ఇబ్రహీంపట్నం మండలం జూపూడిలోని నోవా నిమ్రా కళాశాలలో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్‌ రూమ్‌లను సోమవారం జిల్లా కలెక్టరు డిల్లీరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈవీఎంల భద్రతపై అనుక్షణం అప్రమత్తంగా ఉండాలన్నారు.

Published : 21 May 2024 05:11 IST

స్ట్రాంగ్‌ రూం వద్ద సందర్శకుల రిజిస్టరులో సంతకం చేస్తున్న కలెక్టరు డిల్లీరావు

ఇబ్రహీంపట్నం గ్రామీణం, న్యూస్‌టుడే: ఇబ్రహీంపట్నం మండలం జూపూడిలోని నోవా నిమ్రా కళాశాలలో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్‌ రూమ్‌లను సోమవారం జిల్లా కలెక్టరు డిల్లీరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈవీఎంల భద్రతపై అనుక్షణం అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈవీఎంలకు కేంద్ర, రాష్ట్ర సివిల్‌ పోలీసులతో ప్రభుత్వం మూడు అంచెల భద్రత కల్పించిందన్నారు. స్ట్రాంగ్‌ రూమ్‌ల తలుపులకు వేసిన తాళాలు, వాటికున్న సీళ్లను క్షుణ్నంగా పరిశీలించారు. అన్ని ప్రదేశాలలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. అనధికార వ్యక్తులను స్ట్రాంగ్‌ రూమ్‌లు ఉన్న ప్రాంతంలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరాదన్నారు. ఎన్నికల కమిషన్‌ నిబంధనల ప్రకారం అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం ఆయన స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద ఏర్పాటు చేసిన సందర్శకుల రిజిస్టరులో సంతకం చేశారు.

పోస్టల్‌ బ్యాలట్ల లెక్కింపునకు పక్కా ఏర్పాట్లు 

ఎన్టీఆర్‌ కలెక్టరేట్, న్యూస్‌టుడే : ఇబ్రహీంపట్నం (జూపూడి)లోని నోవా, నిమ్రా కళాశాలల్లో జూన్‌ 4వ తేదీన నిర్వహించే ఓట్ల లెక్కింపుల్లో భాగంగా.. ముందుగా పోస్టల్‌ బ్యాలట్లు లెక్కిస్తామని, దీనికోసం పక్కా ఏర్పాట్లు చేస్తున్నట్టు డీఆర్వో వి.శ్రీనివాసరావు తెలిపారు. నగరంలోని కలెక్టరేట్‌లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని ఏడు అసెంబ్లీ  నియోజకవర్గాలు, విజయవాడ పార్లమెంటుకు సంబంధించి పోస్టల్‌ బ్యాలట్ల కోసం ప్రత్యేక టేబుళ్లు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. అనంతరం స్థానిక మాంటిస్సోరి ఆవరణలోని సబ్‌ కలెక్టర్‌ కార్యాలయ ప్రాంగణంలో పోస్టల్‌ బ్యాలట్లు భద్రపరిచిన స్ట్రాంగ్‌ రూమ్‌లను పరిశీలించారు. ఈ కార్యక్రమాల్లో డీఆర్డీఏ పీడీ, పోస్టల్‌ బ్యాలట్‌ నోడల్‌ అధికారి కె.శ్రీనివాసరావు, వివిధ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని