logo

ఓట్ల లెక్కింపుపై అవగాహన

ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా వేగవంతంగా జరిగేలా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ డీకే బాలాజీ.. అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని స్పందన సమావేశ మందిరంలో పోస్టల్‌ బ్యాలట్‌ ఓట్ల లెక్కింపు ప్రక్రియ డెమో నిర్వహించారు.

Published : 21 May 2024 05:16 IST

అధికారులకు సూచనలిస్తున్న కలెక్టర్‌ బాలాజీ

మచిలీపట్నం(గొడుగుపేట), న్యూస్‌టుడే: ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా వేగవంతంగా జరిగేలా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ డీకే బాలాజీ.. అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని స్పందన సమావేశ మందిరంలో పోస్టల్‌ బ్యాలట్‌ ఓట్ల లెక్కింపు ప్రక్రియ డెమో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పరిశీలించిన కలెక్టర్‌ అధికారులకు పలు సూచనలు చేశారు.  నియోజకవర్గాల్లో పోలైన పోస్టల్‌ బ్యాలట్‌ సంఖ్యను బట్టి 500 ఓట్లకు ఓ టేబుల్‌ ఏర్పాటు చేయాలని, అలాగే లెక్కింపు వేగవంతం అవుతుందన్నారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం తిరస్కరించిన, చెల్లని ఓట్లకు సంబంధించి కారణాలు స్పష్టంగా పేర్కొనాలని సూచించారు. డీఆర్వో కె.చంద్రశేఖరరావు, ఆయా నియోజకవర్గాల ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు పాల్గొన్నారు.

విత్తనాలు, ఎరువులు సిద్ధం చేయండి

మచిలీపట్నం కార్పొరేషన్, న్యూస్‌టుడే: జిల్లాలో వివిధ శాఖల ద్వారా అమలయ్యే కార్యక్రమాలపై ప్రతి 15 రోజులకోసారి సమీక్ష నిర్వహిస్తామని కలెక్టర్‌ డీకే బాలాజీ అన్నారు. సోమవారం ఆయన వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఖరీఫ్‌ సమయం సమీపిస్తున్నందున అవసరమైన విత్తనాలు, ఎరువులు సిద్ధం చేయాలని అన్నారు. జిల్లాలో సాగు భూములు, విస్తీర్ణం, నేలల స్వభావం, సాగు చేసే పంటలు తదితర అంశాలను జిల్లా వ్యవసాయ అధికారి ఎన్‌.పద్మావతి వివరించగా, రైతులు సాగు చేసే విత్తన రకాలు, నేలల స్వభావాన్ని బట్టి వచ్చే దిగుబడులపై మచిలీపట్నం వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డా.ఎం.గిరిజారాణి కలెక్టర్‌కు వివరించారు. ఉద్యాన పంటల వివరాలను జిల్లా ఉద్యాన శాఖాధికారి జ్యోతి తెలిపారు. వారితో కలెక్టర్‌ మాట్లాడుతూ ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియ పూర్తయిన తరువాత అధికారులు క్షేత్ర స్థాయి సిబ్బందితో రోజూ టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించి సమీక్షించాలని, ఆయా శాఖల వారీగా ప్రగతి సూచికల్లో ఉత్తమ స్థానం ఉండేలా అందరూ కృషి చేయాలన్నారు. ప్రకృతి వ్యవసాయ విస్తీర్ణం పెరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా మత్స్య శాఖాధికారి శివసామ్రాజ్యం, సూక్ష్మసేద్య అధికారి జి.విజయలక్ష్మి, ప్రకృతి వ్యవసాయ విభాగాధికారి పార్థసారథిÅ, మార్క్‌ఫెడ్‌ డీఎం మురళీకిషోర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని