logo

మద్యం మత్తులో కత్తితో వీరంగం

కత్తితో పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఒక వ్యక్తి గలాటా చేసిన ఘటన చల్లపల్లిలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చల్లపల్లి కోమలానగర్‌లో చిత్తు కాగితాలు ఏరుకొని జీవించే ఈస్తళ్ల శివ రక్తం గాయాలతో మద్యం మత్తులో ఒంటిపై దుస్తులు లేకుండా కత్తి పట్టుకుని చల్లపల్లి రహదారుల వెంట వీరంగం సృష్టించడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు.

Published : 22 May 2024 03:13 IST

చల్లపల్లి పోలీస్‌స్టేషన్‌లో కుర్చీలు విసిరేసి హల్‌చల్‌

చల్లపల్లి, న్యూస్‌టుడే: కత్తితో పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఒక వ్యక్తి గలాటా చేసిన ఘటన చల్లపల్లిలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చల్లపల్లి కోమలానగర్‌లో చిత్తు కాగితాలు ఏరుకొని జీవించే ఈస్తళ్ల శివ రక్తం గాయాలతో మద్యం మత్తులో ఒంటిపై దుస్తులు లేకుండా కత్తి పట్టుకుని చల్లపల్లి రహదారుల వెంట వీరంగం సృష్టించడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి కుర్చీలను విసిరికొట్టాడు. పోలీసులు అతడ్ని అదుపుచేసే క్రమంలో వారిని దాటుకుని పోలీస్‌ స్టేషన్‌ ఎదుట రహదారిపై కూర్చొని తనను బంధువులు కొట్టారని బూతులు తిడుతూ కత్తిని తిప్పుతూ బిగ్గరగా కేకలు వేస్తూ ప్రజలను భయకంపితులను చేశాడు. ఎట్టకేలకు పోలీసులు అతని బంధువుల సాయంతో చల్లపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో కూడా వైద్యులకు సహకరించకుండా వారిని ఇబ్బందులకు గురిచేశాడు.
గతంలో కూడా.. : ఇదే వ్యక్తి గతంలో కూడా మద్యం మత్తులో చల్లపల్లి ప్రభుత్వాసుపత్రికి వెళ్లి బ్లేడుతో కోసుకుని వైద్యులను తిడుతూ వారిని విధులు నిర్వహించకుండా ఇబ్బందులకు గురిచేశాడు. కోమలానగర్‌ ఎదురుగా ఉన్న చిత్తుకాగితాలు ఏరుకుని జీవించే వారిపై పోలీసు నిఘా ఉంచాలని పలువురు కోరుతున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని