logo

సీపీఆర్‌పై అవగాహన అవసరం

ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని రక్షించడానికి సామాన్య ప్రజలకు కూడా సీపీఆర్‌పై అవగాహన తప్పనిసరి అని ఆంధ్రప్రదేశ్‌ నర్సెస్, మిడ్‌వైవ్స్‌ కౌన్సిల్‌ (ఏపీఎన్‌ఎమ్‌సీ) రిజిస్ట్రార్‌ కె.సుశీల పేర్కొన్నారు.

Published : 22 May 2024 03:29 IST

ఈనాడు, అమరావతి: ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని రక్షించడానికి సామాన్య ప్రజలకు కూడా సీపీఆర్‌పై అవగాహన తప్పనిసరి అని ఆంధ్రప్రదేశ్‌ నర్సెస్, మిడ్‌వైవ్స్‌ కౌన్సిల్‌ (ఏపీఎన్‌ఎమ్‌సీ) రిజిస్ట్రార్‌ కె.సుశీల పేర్కొన్నారు. విజయవాడలో ఈనెల 5న ఆరేళ్ల బాలుడు సాయికి నడిరోడ్డు మీద సీపీఆర్‌ చేసి ప్రాణాలు కాపాడిన మెడ్‌సీ ప్రసూతి వైద్య నిపుణురాలు రవళిని పాత ప్రభుత్వాసుపత్రి ప్రాంగణంలో ఉన్న డీఎమ్‌ఈ కార్యాలయంలో మంగళవారం సన్మానించారు. సుశీల మాట్లాడుతూ.. డా.రవళి అత్యవసరంగా స్పందించడం వల్ల ఒక బాలుడి ప్రాణం కాపాడగలిగారన్నారు. సమాజంలో ఎంత ఎక్కువ మందికి సీపీఆర్‌పై అవగాహన ఉంటే అంతే ఎక్కువగా ప్రాణనష్టాన్ని నివారించవచ్చన్నారు. కార్యక్రమంలో డీఎమ్‌ఈ డి.వి.ఎస్‌.ఎల్‌ నరసింహం, ఐఆర్‌సీఎఫ్‌ ఛైర్మన్‌ డాక్టర్‌.చక్రరావు తదితరులు డా.రవళిని అభినందించి... ప్రశంసాపత్రం అందజేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని