logo

మండల కేంద్రాలకు పాఠ్యపుస్తకాల సరఫరా

ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి ఉమ్మడి కృష్ణా జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులందరికీ పాఠ్య పుస్తకాలు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని కృష్ణా జిల్లా విద్యాశాఖాధికారి తాహెరా సుల్తానా అన్నారు.

Published : 22 May 2024 03:32 IST

విజయవాడ సిటీ, న్యూస్‌టుడే : ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి ఉమ్మడి కృష్ణా జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులందరికీ పాఠ్య పుస్తకాలు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని కృష్ణా జిల్లా విద్యాశాఖాధికారి తాహెరా సుల్తానా అన్నారు. నగరంలోని జిల్లా ప్రభుత్వ పాఠ్య పుస్తకాల విక్రయ కార్యాలయం నుంచి మండలాలకు ఆర్టీసీ కార్గో బస్సుల ద్వారా పుస్తకాలు పంపిస్తున్నారు. మంగళవారం ఆమె జెండా ఊపి పుస్తకాలు తరలించే బస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ... కృష్ణా జిల్లాకు సంబంధించి ఒకటి నుంచి ఏడో తరగతి వరకు 4,36,711... 8 నుంచి పదో తరగతి వరకు 3,95,915... మొత్తం 8,32,626 పుస్తకాలు, ఎన్టీఆర్‌ జిల్లాకు ఒకటి నుంచి ఏడో తరగతి వరకు 2,36,494... 8 నుంచి పదో తరగతి వరకు 4,24,573.... మొత్తం 6,61,861 పుస్తకాలు సరఫరా చేయాల్సి ఉందని వెల్లడించారు. ఒకటి నుంచి ఏడో తరగతి వరకు పుస్తకాలను జిల్లా ప్రభుత్వ పాఠ్యపుస్తకాల విక్రయ కార్యాలయం (విజయవాడ) నుంచి ఆర్టీసీ కార్గో బస్సు ద్వారా మండలాల్లోని పాయింట్లకు సరఫరా చేస్తున్నామని పేర్కొన్నారు. 8, 9, 10 తరగతుల పాఠ్య పుస్తకాలను ప్రింటింగ్‌ ప్రెస్‌ల నుంచి నేరుగా మండలంలోని పాయింట్లకు పంపిస్తారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ప్రభుత్వ పాఠ్యపుస్తకాల విక్రయ కేంద్రం విజయవాడ డిపో మేనేజర్‌ ఏఎస్‌కే ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు