logo

చిరంజీవికి బుద్ధప్రసాద్‌ సత్కారం

పద్మ విభూషణ్‌ పురస్కార గ్రహీత, మెగాస్టార్‌ చిరంజీవిని మాజీ ఉప సభాపతి, కృష్ణా జిల్లా అవనిగడ్డ శాసనసభ నియోజకవర్గ జనసేన అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్‌ మంగళవారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో సత్కరించారు.

Published : 22 May 2024 03:33 IST

అవనిగడ్డ, న్యూస్‌టుడే: పద్మ విభూషణ్‌ పురస్కార గ్రహీత, మెగాస్టార్‌ చిరంజీవిని మాజీ ఉప సభాపతి, కృష్ణా జిల్లా అవనిగడ్డ శాసనసభ నియోజకవర్గ జనసేన అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్‌ మంగళవారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో సత్కరించారు. పద్మ విభూషణ్‌ పురస్కారం లభించిన సందర్భంగా ఆయన్ను సత్కరించినట్లు బుద్ధప్రసాద్‌ చెప్పారు. సినీ నటుడు శ్రీకాంత్, బుద్ధప్రసాద్‌ కుమారుడు మండలి వెంకట్రామ్, అల్లుడు శీలం అశ్వన్‌కుమార్‌ పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని