logo

లెక్కింపు కేంద్రానికి మూడంచెల భద్రత

ఎన్నికల కౌంటింగ్‌ కేంద్రం వద్ద స్ట్రాంగ్‌రూములకు మూడంచెల పటిష్ఠ భద్రత కల్పించినట్లు జిల్లా కలెక్టర్‌ డీకే బాలాజీ అన్నారు.

Published : 22 May 2024 03:40 IST

వైద్య సిబ్బందితో సమీక్ష

మచిలీపట్నం కార్పొరేషన్, న్యూస్‌టుడే: ఎన్నికల కౌంటింగ్‌ కేంద్రం వద్ద స్ట్రాంగ్‌రూములకు మూడంచెల పటిష్ఠ భద్రత కల్పించినట్లు జిల్లా కలెక్టర్‌ డీకే బాలాజీ అన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి మంగళవారం జిల్లా కలెక్టర్‌లతో వీసీ నిర్వహించగా.. కలెక్టరేట్‌ నుంచి కలెక్టర్‌ బాలాజీ, పలువురు అధికారులు హాజరయ్యారు. కలెక్టర్‌  మాట్లాడుతూ జిల్లాలో తాగునీరు, విద్యుత్తు సరఫరా పరిస్థితిని సీఎస్‌కు వివరించారు. జూన్‌ రెండో వారంలో రైతులు సాగు పనులు ప్రారంభిస్తారని, గత అనుభవాల దృష్ట్యా తుపాను పరిస్థితుల్లో పొలాలు ముంపుబారిన పడకుండా కాలువలు, డ్రెయిన్లలో తూడు తొలగించే పనులు చేపట్టాల్సి ఉందన్నారు. గ్రామీణ నీటిసరఫరా విభాగ ఈఈ టి.శివప్రసాదు, డ్వామా పీడీ జీవీ సూర్యనారాయణ, మచిలీపట్నం నగరపాలకసంస్థ కమిషనర్‌ బాపిరాజు, గుడివాడ, ఉయ్యూరు, తాడిగడప మున్సిపల్‌ కమిషనర్‌లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 

వైద్య ఆరోగ్య శాఖ ద్వారా జిల్లాలో అమలయ్యే కార్యక్రమాలపై ప్రతి వారం సమీక్షిస్తామని జిల్లా కలెక్టర్‌ డీకే బాలాజీ అన్నారు. మంగళవారం ఆ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయిన తరువాత క్షేత్ర స్థాయి సిబ్బందితో రోజూ టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించాలని డీఎంహెచ్‌వో గీతాబాయిని ఆదేశించారు. సిబ్బంది వారీగా నిర్వహించాల్సిన విధులు, వివిధ కార్యక్రమాలకు సంబంధించిన యాప్‌ల నిర్వహణ, సాధించాల్సిన ప్రగతి వచ్చే నెల 18న సమావేశం నిర్వహిస్తామన్నారు. ఈలోపు అన్నీ సిద్ధం చేయాలన్నారు. మచిలీపట్నంలో ప్రభుత్వ వైద్యకళాశాల, సర్వజన ఆసుపత్రితో పాటు గుడివాడలో ప్రాంతీయ ఆసుపత్రి ఉన్నాయని అన్నారు. వీటితో పాటు 49 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 13 పట్టణ ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయని అన్నారు. ఆయా కేంద్రాల్లో పని చేస్తున్న వైద్యులు, సిబ్బంది, ఖాళీల వివరాలను డీఎంహెచ్‌వో కలెక్టర్‌కు వివరించారు. ఆరోగ్యశ్రీ జిల్లా సమన్వయకర్త  డా.సతీష్, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని