logo

విద్యుత్తు స్తంభాన్ని ఢీకొన్న ట్రాక్టర్‌

ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నా నియోజకవర్గంలో వైకాపా నాయకుల మట్టి అక్రమ తవ్వకాలు, తరలింపునకు అడ్డులేకుండాపోయింది.

Published : 24 May 2024 03:58 IST

మట్టి అక్రమ రవాణా చేస్తుండగా ఘటన
తప్పిన పెనుప్రమాదం

పూరిల్లుపై పడిన స్తంభం

అవనిగడ్డ, న్యూస్‌టుడే: ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నా నియోజకవర్గంలో వైకాపా నాయకుల మట్టి అక్రమ తవ్వకాలు, తరలింపునకు అడ్డులేకుండాపోయింది. సరికదా అక్రమంగా మట్టి తరలిస్తున్న వాహనాలు ప్రజల ప్రాణాలకు ముప్పుగా పరిణమించాయి. ఇందుకు అవనిగడ్డలో గురువారం జరిగిన ఘటనే నిదర్శనం. స్థానిక తిప్పపాలం వద్ద అక్రమంగా మట్టి రవాణా చేస్తున్న ట్రాక్టర్‌.. గురువారం విద్యుత్తు  స్థంభాన్ని ఢీకొనడంతో స్తంభం విరిగి పక్కనే ఉన్న పూరిల్లుపై పడింది. విద్యుత్తు తీగలు తెగిపోవడంతో సరఫరా నిలిచిపోవడంతో పెనుప్రమాదం తప్పింది. స్తంభం విరిగిన చోట ఆ శాఖ అధికారులు గప్‌చిప్‌గా కొత్తది ఏర్పాటు చేసినట్టు తెలిసింది. దీనిపై కేసు పెట్టకుండా అధికార పార్టీ నాయకులు తెరవెనుక మంతనాలు జరుపుతున్నారని సమాచారం. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ మట్టి, ఇసుక, బుసక తవ్వకాలను నివారించాలని పలువురు ప్రజలు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని