logo

జోరు వర్షం.. రోడ్లు జలమయం

శనివారం ఉదయం నుంచి కురిసిన వర్షానికి నగరం జలమయం కావడంతో పాటు నగరవాసులు అష్టకష్టాలు పడ్డారు.

Published : 26 May 2024 05:16 IST

కరణంగారి వీధిలో..,  పీఅండ్‌టీ కాలనీలో.., నీట మునిగిన శ్రీరామచంద్రనగర్‌ ప్రధాన వీధి 

పటమట, న్యూస్‌టుడే: శనివారం ఉదయం నుంచి కురిసిన వర్షానికి నగరం జలమయం కావడంతో పాటు నగరవాసులు అష్టకష్టాలు పడ్డారు. ఎన్టీఆర్‌ సర్కిల్, నిర్మల కాన్వెంట్‌ రోడ్డు, ఆటోనగర్‌లోని పోలీస్‌ స్టేషన్‌ రోడ్డు, ఫైర్‌ స్టేషన్‌ రోడ్డు వందడగుల రోడ్డులో సన్‌లైట్‌ సెంటర్, కాటా సెంటర్‌ తదితర ప్రాంతాలు పూర్తి జలమయం కావడంతో జనం ఇబ్బంది పడ్డారు. ఎన్టీఆర్‌ సర్కిల్, నిర్మల కాన్వెంట్‌ రోడ్డులో మోకాల్లోతు వరద నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది.

శివారు కాలనీలు విలవిల

కరెన్సీనగర్, న్యూస్‌టుడే:  మూడో డివిజన్‌ శ్రీరామచంద్రనగర్, గణేష్‌ కాలనీ, గుణదల, కరెన్సీనగర్‌ ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. దీంతో పాటుగా బాయన బాబూజీ రహదారి వెంబడి ఉన్న పంటకాలువ డ్రెయిన్‌ ప్రమాదపు స్థాయిలో పొంగుతోంది. నాలుగో డివిజన్‌ శ్రీనగర్‌ కాలనీ తిమ్మరుసు వీధి, సీటీవో కాలనీ, సుబ్బారావు కాలనీ అంతర్గత రోడ్లలోనూ వర్షపు నీరు నిలిచింది. రమేష్‌ ఆస్పత్రి జంక్షన్‌ నుంచి లయోల కళాశాల వెంబడి ఉన్న పుల్లేటి కట్ట పొంగి పొర్లుతోంది. ఈఎస్‌ఐ హాస్పిటల్‌ ప్రాంతం నుంచి గుణదల సెంటర్‌ వరకు డ్రెయిన్‌ పూర్తి స్థాయిలో వెళుతుండడంతో రాకపోకలు స్తంభించాయి. ఈ డివిజన్లలలో భూగర్బ డ్రైనేజీ మ్యాన్‌హోల్స్‌ నుంచి మురుగునీరు బయటకు వస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు