logo

వల్లభనేని వంశీని తరిమికొట్టిన తెదేపా శ్రేణులు

గన్నవరం వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి వల్లభనేని వంశీమోహన్‌ను ఈ నెల 13వ తేదీన.. ఎన్నికల పోలింగ్‌ రోజు తెదేపా శ్రేణులు తరిమికొట్టిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Updated : 26 May 2024 08:38 IST

సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్‌

తెదేపా శ్రేణుల ప్రతిఘటనతో రివర్స్‌లో వెనక్కి వెళ్లిపోతున్న వంశీ కారు 

విజయవాడ, న్యూస్‌టుడే : గన్నవరం వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి వల్లభనేని వంశీమోహన్‌ను ఈ నెల 13వ తేదీన.. ఎన్నికల పోలింగ్‌ రోజు తెదేపా శ్రేణులు తరిమికొట్టిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. గన్నవరం మండలం కేసరపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలోని పోలింగ్‌ కేంద్రం వద్దకు మధ్యాహ్నం 3 గంటల సమయంలో వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీమోహన్‌ వచ్చారు. అనుచరులతో కలిసి వచ్చిన ఆయన.. తెదేపా సీనియర్‌ నాయకుడు పొట్లూరి బసవరావు, ఇతర నాయకులపై దాడికి యత్నిస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. ఆ సమయంలో ఒక్కసారిగా తెదేపా శ్రేణులు భారీగా చేరుకోవడంతో.. పోలీసుల సాయంతో నెమ్మదిగా తన కారును రివర్స్‌లో పోనిస్తూ అక్కడి నుంచి వంశీమోహన్‌ పరారయ్యారు. తాజాగా శనివారం ఆ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని