logo

అనుమానాస్పద వ్యక్తులకు వసతి ఇవ్వొద్దు

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కొత్త వ్యక్తులు, నేర చరిత్ర గల వారికి, అనుమానాస్పద వ్యక్తులకు లాడ్జిలు, హోటళ్లు, ఫంక్షన్‌ హాళ్లలో వసతి ఇవ్వొద్దని సౌత్‌ ఏసీపీ జి.రత్నరాజు పేర్కొన్నారు.

Published : 27 May 2024 04:13 IST

గవర్నర్‌పేట, న్యూస్‌టుడే : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కొత్త వ్యక్తులు, నేర చరిత్ర గల వారికి, అనుమానాస్పద వ్యక్తులకు లాడ్జిలు, హోటళ్లు, ఫంక్షన్‌ హాళ్లలో వసతి ఇవ్వొద్దని సౌత్‌ ఏసీపీ జి.రత్నరాజు పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం గవర్నర్‌పేట పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో లాడ్జిలు, హోటళ్లు, ఫంక్షన్‌ హాళ్ల యజమానులతో ఆయన సమావేశం నిర్వహించారు. వారికి పలు సూచనలు చేశారు. ఎన్నికల నేపథ్యంలో పోలీస్‌ కమిషనర్‌ పి.హెచ్‌.డి.రామకృష్ణ ఆదేశాల మేరకు నగరంలో ఏ విధమైన అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచామని చెప్పారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఏ విధమైన ఉద్రిక్త వాతావరణం నెలకొనకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా బయటి వ్యక్తులకు, అనుమానాస్పద వ్యక్తులకు గదులు అద్దెకు ఇవ్వొద్దని యజమానులకు సూచించారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలు గమనిస్తే తక్షణం తమకు సమాచారం అందించాలని కోరారు. కాగా.. ముందస్తు భద్రతాచర్యల్లో భాగంగా ఆదివారం సాయంత్రం గవర్నర్‌పేట, హనుమాన్‌పేట తదితర ప్రాంతాల్లోని లాడ్జిలు, హోటళ్లు తనిఖీ చేశారు. హోటళ్లలో దిగిన వారి వివరాలు సేకరించారు. నగరానికి ఎందుకు వచ్చారు? తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. గవర్నర్‌పేట సీఐ డి.వెంకటరమణ, ఎస్సైలు కృష్ణబాబు, నారాయణమ్మ, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు