logo

కిటకిటలాడిన తిరుపతమ్మ ఆలయం

వేలాదిగా తరలివచ్చిన భక్తులతో ఆదివారం పెనుగంచిప్రోలు శ్రీలక్ష్మి తిరుపతమ్మ అమ్మవారి ఆలయం కిటకిటలాడింది.తెల్లవారుజాము నుంచి మొదలైన భక్తుల రాక మధ్యాహ్నం వరకు కొనసాగింది.

Published : 27 May 2024 04:14 IST

పెనుగంచిప్రోలు, న్యూస్‌టుడే : వేలాదిగా తరలివచ్చిన భక్తులతో ఆదివారం పెనుగంచిప్రోలు శ్రీలక్ష్మి తిరుపతమ్మ అమ్మవారి ఆలయం కిటకిటలాడింది.తెల్లవారుజాము నుంచి మొదలైన భక్తుల రాక మధ్యాహ్నం వరకు కొనసాగింది.ఈ నేపథ్యంలో అమ్మవారి దర్శనానికి ఒక్కసారిగా భక్తులు పోటెత్తడంతో క్యూలైన్లు నిండిపోయాయి.దర్శనానికి గంటల సమయం పట్టడంతో ఉక్కపోతకు చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.సుమారు 35 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.దాతల సాయంతో భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు.ఎస్సై రాంబాబు తమ సిబ్బందితో కలిసి పలుచోట్ల ట్రాఫిక్‌ క్రమబద్దీకరణ చేసి వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని