logo

రికార్డు స్థాయిలో దుర్గగుడి ఆదాయం

రికార్డు స్థాయిలో ఆదివారం దుర్గగుడి ఆదాయం రూ.46.15లక్షలకు చేరింది. దసరా ఉత్సవాలు, పర్వదినాల్లో ఆదాయం పెరగడం సర్వసాధారణం.

Published : 27 May 2024 04:21 IST

ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే : రికార్డు స్థాయిలో ఆదివారం దుర్గగుడి ఆదాయం రూ.46.15లక్షలకు చేరింది. దసరా ఉత్సవాలు, పర్వదినాల్లో ఆదాయం పెరగడం సర్వసాధారణం. సెలవు రోజుల్లో సైతం దర్శనం టికెట్లు, ప్రసాదాలు, ఇతర సేవల ద్వారా అమ్మవారి ఆదాయం గత మూడు రోజులుగా క్రమంగా పెరిగింది. ఈ నెల 24న రూ. 42.05 లక్షలు, 25న రూ.32.43 లక్షల ఆదాయం వచ్చింది. ఆదివారం రూ.500 టిక్కెట్ల ద్వారా రూ.13,00,500, రూ.300 టికెట్ల ద్వారా రూ.5,23,800, రూ.100 టికెట్ల ద్వారా రూ.8,47,800 ఆదాయం సమకూరింది. లడ్డూ ప్రసాదం ద్వారా రూ.61,575, పులిహోర ప్రసాదం ద్వారా రూ.32,490 ఆదాయం వచ్చినట్లు ఈవో రామారావు తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని